టెక్ వ్యూ : తదుపరి నిరోధం 23,600
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:21 AM
నిఫ్టీ గత వారం 23,300 వద్ద అప్రమత్త మైనర్ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమయింది. తదుపరి సెషన్లలో గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి, ఇంట్రాడే కరెక్షన్లు ఎదుర్కొంటూనే వారాంతానికి 175 పాయింట్ల లాభంతో...

టెక్ వ్యూ : తదుపరి నిరోధం 23,600
నిఫ్టీ గత వారం 23,300 వద్ద అప్రమత్త మైనర్ అప్‌ట్రెండ్‌లో ప్రారంభమయింది. తదుపరి సెషన్లలో గరిష్ఠ స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి, ఇంట్రాడే కరెక్షన్లు ఎదుర్కొంటూనే వారాంతానికి 175 పాయింట్ల లాభంతో జీవితకాల గరిష్ఠ స్థాయిలో, మానసిక అవధి 23,500 సమీపంలో నిలకడగా ముగిసింది. జూన్ 4వ తేదీన ఏర్పడిన మహాపతనం అనంతరం గత రెండు వారాల కాలంలో నిఫ్టీ కనిష్ఠ స్థాయిల నుంచి 2,000 పాయింట్ల వరకు లాభపడింది. ఇక మిడ్‌క్యాప్-100 సూచీ 2,000 పాయింట్లు, స్మాల్‌క్యా్‌పసూచీ 830 పాయింట్ల మేరకు లాభపడ్డాయి.
జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో నిలిచి ఉన్న మార్కెట్ గత వారం నిలకడ ధోరణిని బట్టి పాజిటివ్ ధోరణిలోనే ప్రారంభం కావచ్చు. ఇప్పుడు జీవితకాల గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకుంటుందో, లేదో వేచి చూడాలి.
బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీకి తదుపరి మానసిక అవధి 23,600. కొత్త శిఖరాలకు ప్రయాణించాలంటే ఈ స్థాయి కన్నా పైన నిలదొక్కుకోవా లి. ఆపైన మానసిక అవధులు 23,800, 24,000.
బేరిష్ స్థాయిలు: కరెక్షన్‌లో పడినట్టయితే దిగువన మద్దతు స్థాయి 23,400. ఇక్కడ విఫలమైతే మైనర్ బలహీనతకు ఆస్కారం ఉంది. ప్రధాన మద్దతు స్థాయిలు 23,200, 23,000. కాని సాధారణ పరిస్థితుల్లో తక్షణ ముప్పు ఏమీ లేదు.
బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారం పరిమిత పరిధిలోనే కదలాడి 200 పాయింట్ల లాభంతో ముగిసింది. రెండు వారాల పాటు మానసిక అవధి 50,000 వద్ద పరీక్ష ఎదుర్కొన్న అనంతరం నిలకడగా క్లోజైంది. మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 50,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన మరో నిరోధం 51,200. బలహీనత ప్రదర్శించి 50,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే అప్రమత్తతను సూచిస్తుంది.
పాటర్న్: మార్కెట్ గత వారం కన్సాలిడేషన్ అనంతరం గతంలో ఏర్పడిన గరిష్ఠ స్థాయి, టాప్ 23,350 వద్ద బ్రేకౌట్ సాధించింది. ఇది పాజిటివ్ ట్రెండ్ సంకేతం.
రియాక్షన్‌లో పడితే భద్రత కోసం 23,400 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవాలి.
టైమ్: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్ రివర్సల్ ఉంది.
మంగళవారం స్థాయిలు
నిరోధం : 23,600, 23,655
మద్దతు : 23,470, 23,400
వి. సుందర్ రాజా