Share News

టెక్‌ వ్యూ ప్రధాన మద్దతు 24,400 చేరువలో...

ABN , Publish Date - Aug 05 , 2024 | 06:01 AM

నిఫ్టీ గత వారం మానసిక అవధి 25,000 దాటినా గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోలేక బలమైన కరెక్షన్‌ సాధించింది. శుక్రవారం ఏర్పడిన ఈ బలమైన రియాక్షన్‌తో స్వల్పకాలిక ర్యాలీకి అవరోధం...

టెక్‌ వ్యూ ప్రధాన మద్దతు 24,400 చేరువలో...

టెక్‌ వ్యూ : ప్రధాన మద్దతు 24,400 చేరువలో...

నిఫ్టీ గత వారం మానసిక అవధి 25,000 దాటినా గరిష్ఠ స్థాయిల్లో నిలదొక్కుకోలేక బలమైన కరెక్షన్‌ సాధించింది. శుక్రవారం ఏర్పడిన ఈ బలమైన రియాక్షన్‌తో స్వల్పకాలిక ర్యాలీకి అవరోధం ఏర్పడినట్టు కనిపిస్తోంది. గతంలో రెండు టాప్‌లు ఏర్పడిన ఈ స్థాయిలో నిలదొక్కుకోలేకపోవడం ద్వారా ఇక్కడ బలమైన స్వల్పకాలిక నిరోధం ఏర్పడింది. 9 వారాల ర్యాలీలో ఏదైనా వారంలో నిఫ్టీ నష్టాలతో ముగియడం ఇదే ప్రథమం. గత వారంతో పోల్చితే 120 పాయింట్ల నష్టంతో నిఫ్టీ వారం కనిష్ఠ స్థాయిలో ముగిసింది. ఇక మిడ్‌క్యాప్‌ 100 సూచీ గత వారం 145 పాయింట్ల మైనర్‌ లాభంతో ముగిసినా గరిష్ఠ స్థాయి కన్నా 1500 పాయింట్ల మేరకు దిగజారింది.


స్మాల్‌క్యాప్‌ 100 సూచీ మాత్రం 55 పాయింట్ల నష్టంతో ముగిసింది. గత శుక్రవారంఅమెరికన్‌ మార్కెట్లలో డౌన్‌ట్రెండ్‌ కారణంగా ఈ వారంలో మన మార్కెట్లో మరింత రియాక్షన్‌ ఏర్పడడానికే అవకాశం ఉంది. అలాగే వరుస ర్యాలీ కారణంగా కన్సాలిడేషన్‌ లేదా కరెక్షన్‌ ఏర్పడడం తప్పనిసరి. మొదట మార్కెట్‌ నిలదొక్కుకోవడం అవసరం.

బుల్లిష్‌ స్థాయిలు: ఒకవేళ ఏదైనా కరెక్షన్‌ ఏర్పడి అక్కడ నుంచి రికవరీ సాధించినా మరింత అప్‌ట్రెండ్‌ కోసం మైనర్‌ నిరోధం 24,700 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధ స్థాయిలు 24,850, 25,000.

బేరిష్‌ స్థాయిలు: మరింత బలహీనత ప్రదర్శించి ప్రధాన మద్దతు స్థాయి 24,550 కన్నా దిగజారితే మరింత బలహీనత ఏర్పడవచ్చు. ప్రధాన మద్దతు స్థాయి 24,400. ఇక్కడ కన్సాలిడేషన్‌ లేదా రికవరీకి ఆస్కారం ఉంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ కూడా గత వారం 52,000 స్థాయిని దాటినా నిలదొక్కుకోలేక శుక్రవారం 51,350 వద్ద ముగిసింది. మరింత బలహీనత ప్రదర్శించినా ట్రెండ్‌ లో సానుకూలత కోసం మద్దతు స్థాయి 50,800 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన మద్దతు స్థాయి 50,400. రికవరీ బాట పడితే 51,500 వద్ద గట్టి నిరోధం ఉంది.

పాటర్న్‌: మార్కెట్‌ స్వల్పకాలిక 25 డిఎంఏ వద్ద పరీక్షకు సిద్ధపడుతోంది. ఈ కీలక స్థాయిలో పరీక్ష ఎదుర్కొనడం ఇది రెండో సారి. 24,400 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద మద్దతు కనిపిస్తోంది. సానుకూలత కోసం ఇక్కడ రికవరీ సాధించి తీరాలి.


టైమ్‌: ఈ సూచీ ప్రకారం మంగళ, శుక్ర వారాల్లో తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

సోమవారం స్థాయిలు

నిరోధం : 24,700, 24,780

మద్దతు : 24,600, 24,550

వి. సుందర్‌ రాజా

Updated Date - Aug 05 , 2024 | 06:01 AM