Share News

టెక్‌ వ్యూ : కీలక స్థాయి 23100

ABN , Publish Date - Jun 03 , 2024 | 06:15 AM

నిఫ్టీ గత వారం 23000 వద్ద రియాక్షన్‌లో పడి వారం అంతా అదే ధోరణిలో నడిచింది. కాని శుక్రవారం 22500 వద్ద రికవరీ సాధించి అదే స్థాయిలో నిలకడగా ముగిసింది. అయినా వారం మొత్తం మీద...

టెక్‌ వ్యూ : కీలక స్థాయి  23100

టెక్‌ వ్యూ : కీలక స్థాయి 23100

నిఫ్టీ గత వారం 23000 వద్ద రియాక్షన్‌లో పడి వారం అంతా అదే ధోరణిలో నడిచింది. కాని శుక్రవారం 22500 వద్ద రికవరీ సాధించి అదే స్థాయిలో నిలకడగా ముగిసింది. అయినా వారం మొత్తం మీద 430 పాయింట్లు నష్టపోయింది. టెక్నికల్‌గా గతంలో సాధించిన ర్యాలీ అనంతరం ఏర్పడిన సాధారణ కరెక్షన్‌ ఇది. అలాగే ముందు వారం ఎన్నో ప్రయత్నాల అనంతరం 23000 వద్ద సాధించిన బ్రేకౌట్‌కు పుల్‌బ్యాక్‌ రియాక్షన్‌గా కూడా దీన్ని భావించవచ్చు. అయినా స్వల్పకాలిక మద్దతు స్థాయి 22500 కన్నా పైనే ఉండడం పాజిటివ్‌ ట్రెండ్‌ సంకే తం. గత వారంలో మిడ్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 720 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌ 100 ఇండెక్స్‌ 190 పాయింట్ల నష్టంతో ముగిశాయి. శుక్రవారం వెల్లడైన జీడీపీ గణాంకాలు, శనివారం వెల్లడైన ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ ధోరణులను బట్టి ఈ వారంలో పాజిటివ్‌గానే ప్రారంభం కావచ్చు. మరోసారి 23000 వద్ద పరీక్షకు గురయ్యే ఆస్కారం ఉంది.


బుల్లిష్‌ స్థాయిలు: ఈ వారంలో గ్యాప్‌ అప్‌ ఉంటుందని భావిస్తున్న రీత్యా ఎక్కడ, ఎలా ప్రారంభమయ్యేది మార్కెట్‌ వేళలు మొదలైన తర్వాతే తెలుస్తుంది. ఆటుపోట్లను తగ్గించుకుని నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. పాజిటివ్‌ ధోరణిలో ప్రారంభమైతే పైన నిరోధ స్థాయిలు 22900, 23100. ఆ పైన మాత్రమే కొత్త శిఖరాల దిశగా పురోగమిస్తుంది.

బేరిష్‌ స్థాయిలు: 22900 వద్ద విఫలమైతే మైనర్‌ బలహీనతలో పడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 22500. సాధారణ పరిస్థితిలో ఈ స్థాయి వరకు దిగజారకపోవచ్చు.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం పాజిటివ్‌ ట్రెండ్‌లోనే మొదలైనా 49600 వద్ద రియాక్షన్‌లో పడి చివరికి 49000 సమీపంలో ఫ్లాట్‌గా ముగిసింది. రికవరీ బాట పడితే మరింత అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన నిరోధం 50000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మైనర్‌ నిరోధం 49500 వద్ద నిలదొక్కుకోలేకపోతే అప్రమత్త సంకేతం ఇస్తుంది.


పాటర్న్‌ : గత వారం మార్కెట్‌ 25, 50 డిఎంఏల వద్ద మైనర్‌ రికవరీ సాధించింది. స్వల్పకాలిక ఓవర్‌బాట్‌ స్థితిని కూడా సద్దుబాటు చేసుకుంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం 23100 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం బుధవారం మైనర్‌ రివర్సల్‌ ఉంది.

సోమవారం స్థాయిలు

నిరోధం : 22900, 23040

మద్దతు : 22800, 22730

వి. సుందర్‌ రాజా

Updated Date - Jun 03 , 2024 | 06:15 AM