టెక్ వ్యూ : 25,000 స్థాయి కీలకం
ABN , Publish Date - Oct 21 , 2024 | 02:38 AM
నిఫ్టీ గత వారం ప్రారంభంలో మరింత కరెక్షన్‌ను కొనసాగించినప్పటికీ శుక్రవారం బలమైన రికవరీ సాధించి ముందు వారం కన్నా 110 పాయింట్ల నష్టంతో 24,850 వద్ద ముగిసింది. శుక్రవారం 250 పాయింట్ల మేరకు...
టెక్ వ్యూ : 25,000 స్థాయి కీలకం
నిఫ్టీ గత వారం ప్రారంభంలో మరింత కరెక్షన్‌ను కొనసాగించినప్పటికీ శుక్రవారం బలమైన రికవరీ సాధించి ముందు వారం కన్నా 110 పాయింట్ల నష్టంతో 24,850 వద్ద ముగిసింది. శుక్రవారం 250 పాయింట్ల మేరకు ఇంట్రాడే రికవరీ సాధించడం దిగువ స్థాయిలో మార్కెట్ మద్దతు సాధించిందనేందుకు సంకేతం. మిడ్‌క్యాప్-100 సూచీ కూడా గత శుక్రవారం 1,000 పాయింట్ల మేరకు బలమైన రికవరీ సాధించి వారం మొత్తం మీద నష్టాన్ని 560 పాయింట్లకు కుదించుకుంది. స్మాల్‌క్యాప్-100 సూచీ సైతం కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ సాధించి వారం మొత్తం మీద 70 పాయింట్ల లాభంతో ముగిసింది. గత రెండు వారాలుగా కనిష్ఠ స్థాయిల్లో రికవరీ సాధిస్తూ వస్తున్నా వారం రేంజీకి మధ్యస్థంగా ముగుస్తూ ఉండడం ట్రెండ్‌లో అనిశ్చితిని సూచిస్తోంది. గత రెండు వారాలుగా 25,000 వద్ద ఊగిసలాడుతున్న నిఫ్టీ ఈ వారంలో కూడా ఆ స్థాయిలో పరీక్ష ఎదుర్కొనే ఆస్కారం ఉంది. 25,000 వద్ద మార్కెట్ నిలదొక్కుకుని సానుకూల ట్రెండ్‌లో ప్రవేశించేది, లేనిది వేచి చూడాలి.
బుల్లిష్ స్థాయిలు: పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడయినట్టయితే ప్రధాన నిరోధం 25,000 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 25,250. స్వల్పకాలిక సానుకూల ధోరణి కోసం ఈ స్వల్పకాలిక నిరోధం వద్ద మార్కెట్ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
బేరిష్ స్థాయిలు: 25,000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే స్వల్పకాలిక బలహీనతలో ప్రవేశిస్తుంది. మద్దతు స్థాయి 24,700. బలహీనతను నివారించేందుకు ఇక్కడ తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి. విఫలమైతే మరింత బలహీనపడుతుంది. మరో మద్దతు స్థాయి 24,500.
బ్యాంక్ నిఫ్టీ: గత వారం 51,000 వరకు దిగజారిన బ్యాంక్ నిఫ్టీ చివరికి 800 పాయింట్ల లాభంతో 52,000 సమీపంలో ముగిసింది. మరింత పాజిటివ్ ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 52,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రస్తుత మద్దతు స్థాయి 52,000 వద్ద నిలదొక్కుకోలేకపోతే మరింత బలహీనపడుతుంది.
పాటర్న్: మరింత సానుకూలత కోసం నిఫ్టీ 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్ ట్రెండ్‌లైన్’’ వద్ద నిలదొక్కుకోవాలి. గత వారం నిఫ్టీ 100 డిఎంఏ వద్ద రికవరీ సాధిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు 25,000 సమీపంలో ఉన్న 50 డిఎంఏకు చేరువవుతోంది. సానుకూలత కోసం రాబోయే కొద్ది రోజుల్లో ఇక్కడ నిలదొక్కుకోవడం తప్పనిసరి.
టైమ్: ఈ సూచీ ప్రకారం మంగళ వారం తదుపరి మైనర్ రివర్సల్ ఉండవచ్చు.
సోమవారం స్థాయిలు
నిరోధం : 24,940, 25,000
మద్దతు : 24,770, 24,700
వి. సుందర్ రాజా