Share News

పెద్దల కోసం పన్ను సంస్కరణలు

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:39 AM

పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాల కోసం పన్నుల సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్‌ కోరింది. ఇందుకు వారి కోసం ప్రత్యేక పొదుపు, గృహ పథకాలు తీసుకురావాలని ఒక నివేదికలో ...

పెద్దల కోసం పన్ను సంస్కరణలు

పొదుపు, గృహ పథకాలు తప్పనిసరి: నీతి ఆయోగ్‌

న్యూఢిల్లీ: పెరుగుతున్న వృద్ధుల జనాభా అవసరాల కోసం పన్నుల సంస్కరణలు చేపట్టాలని ప్రభుత్వాన్ని నీతి ఆయోగ్‌ కోరింది. ఇందుకు వారి కోసం ప్రత్యేక పొదుపు, గృహ పథకాలు తీసుకురావాలని ఒక నివేదికలో సూచించింది. ప్రస్తుతం దేశ జనాభాలో 10 శాతంగా ఉన్న వృద్ధుల జనాభా, 2050 నాటికి 19.5 శాతానికి పెరగబోతున్న విషయాన్ని నీతి ఆయోగ్‌ గుర్తు చేసింది. దేశంలో కొద్ది మంది వృద్ధులకు మాత్రమే ఆర్థిక భద్రత ఉన్న విషయాన్నీ గుర్తు చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వడ్డీ రేట్ల మార్పు ప్రభావం వారిపై పెద్దగా పడకుండా ఉండేలా సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్‌ పథకాన్ని తీర్చిదిద్దాలని కోరింది.

రివర్స్‌ మార్టగేజ్‌ను సంస్కరించాలి: సీనియర్‌ సిటిజన్ల కోసం ఉద్దేశించిన రివర్స్‌ మార్టగేజ్‌ పథకాన్ని మరింత సంస్కరించాని నీతి ఆయోగ్‌ కోరింది. అలాగే సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా ఉపయోగించే ఉత్పత్తులపైనా జీఎస్‌టీతో సహా ఇతరు పన్ను రాయితీలు ఇవ్వాలని సూచించింది. కంపెనీలు సామాజిక బాధ్యత కింద ఖర్చు చేసే సీఎస్‌ఆర్‌ నిధుల్లో కొంత భాగం సీనియర్‌ సిటిజన్ల సంరక్షణకు వినియోగించేందుకు అనుమతించాలని సూచించింది.

Updated Date - Feb 20 , 2024 | 04:39 AM