Share News

టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ.. పాకిస్థాన్‌ జీడీపీ కంటే ఎక్కువ

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:47 AM

దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 36,500 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.30.3 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే...

టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ.. పాకిస్థాన్‌ జీడీపీ కంటే ఎక్కువ

రూ.30 లక్షల కోట్లు దాటిన టాటా కంపెనీల మార్కెట్‌ క్యాప్‌

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 36,500 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.30.3 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ పరిమాణం కంటే అధికం. గత ఏడాది నాటికి పాకిస్థాన్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 34,100 కోట్ల డాలర్ల స్థాయిలో ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ అంచనా. కాగా, టాటా గ్రూప్‌లో అత్యంత విలువైన, దేశీయ లిస్టెడ్‌ కంపెనీల్లో రెండో అత్యంత విలువైన కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స (టీసీఎస్‌) మార్కెట్‌ క్యాప్‌ రూ.15 లక్షల కోట్లు దాటింది. టాటా గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువలో 50 శాతం వాటా ఈ కంపెనీదే. అంటే, పాకిస్థాన్‌ ఎకానమీ సైజులో సగం. గడిచిన ఏడాది కాలంలో టీసీఎ్‌సతోపాటు టాటా మోటార్స్‌, ట్రెంట్‌, టాటా పవర్‌, టైటాన్‌, టీఆర్‌ఎఫ్‌ షేర్లు భారీగా పుంజుకోవడం గ్రూప్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వృద్ధికి ప్రధానంగా దోహదపడ్డాయి.

మన టాప్‌-10 కంపెనీల విలువ

6 పొరుగు దేశాల జీడీపీ కంటే అధికం

గత వారం చివరి నాటికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌), టీసీఎస్‌, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ సహా దేశంలోని అత్యంత విలువైన 10 లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 1.1 లక్షల కోట్ల డాలర్లకు (సుమారు రూ.89.98 లక్షల కోట్లు) చేరుకుంది. దక్షిణాసియాలోని 6 పొరుగు దేశాల (పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంక, భూటాన్‌, మాల్దీవులు) మొత్తం జీడీపీ కంపెనీ అధికమిది. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ రిపోర్టు 2023’లో ఐఎంఎఫ్‌ పేర్కొ న్న అంచనాల ప్రకారం.. ఈ ఆరు దేశాల మొత్తం జీడీపీ విలువ 91,200 కోట్ల డాలర్లు. కాగా, దేశంలో అత్యంత విలువైన కంపెనీ ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 23,800 కోట్ల డాలర్ల స్థాయికి ఎగబాకింది. ఇది శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవుల మొత్తం జీడీపీ కంటే అధికం.

Updated Date - Feb 20 , 2024 | 04:47 AM