Share News

ఆదుకున్న ఆఖరి గంట కొనుగోళ్లు

ABN , Publish Date - Jan 11 , 2024 | 03:28 AM

స్టాక్‌మార్కెట్‌ బుధవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైనా చివరి గంట కొనుగోళ్లతో లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 71,110.98 పాయింట్లు, 71,733.84 పాయింట్ల మధ్యన కదలాడి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి...

ఆదుకున్న ఆఖరి గంట కొనుగోళ్లు

  • లైఫ్‌ టైమ్‌ హైలో రిలయన్స్‌ షేర్లు

ముంబై: స్టాక్‌మార్కెట్‌ బుధవారం తీవ్ర ఆటుపోట్లకు లోనైనా చివరి గంట కొనుగోళ్లతో లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 71,110.98 పాయింట్లు, 71,733.84 పాయింట్ల మధ్యన కదలాడి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 271.50 పాయింట్ల లాభంతో 71,657.71 వద్ద ముగిసింది. నిఫ్టీ 73.85 పాయింట్ల లాభంతో 21,618.70 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ చివర్లో రిలయన్స్‌ ఇండస్ర్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటి హెవీ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాల నుంచి బయట పడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 2.7 శాతం వృద్ధితో జీవిత కాల గరిష్థ స్థాయి రూ.2,658.95ని నమోదు చేశాయి. చివరికి 2.69 శాతం లాభంతో రూ.2,649.95 వద్ద ముగిశాయి.

పబ్లిక్‌ ఇష్యూకి జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌: జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ ఐపీఓకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ రూ.6,000 కోట్ల మెగా ఐపీఓ కోసం కంపెనీ ఇప్పటికే ప్రముఖ దేశ, విదేశీ బ్యాంకులతో చర్చలు జరుపుతోంది. ఈ ఐపీఓ మార్కెట్‌కు వస్తే సిమెంట్‌ రంగంలో ఇదే అతి పెద్ద ఐపీవో అవుతుంది. జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌కు ఏపీలోని నంద్యాల, కర్ణాటకలోని విజయనగర్‌, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోని, ఒడిసాలోని జాజ్‌పూర్‌, మహారాష్ట్రలోని డొల్వి వద్ద సిమెంట్‌ ప్లాంట్లున్నాయి.

Updated Date - Jan 11 , 2024 | 03:28 AM