Share News

డెరివేటివ్స్‌ కట్టడి కోసం కఠిన చర్యలు!

ABN , Publish Date - Jul 08 , 2024 | 06:18 AM

చిన్న మదుపరులు కొంప ముంచుతున్న డెరివేటివ్స్‌ కట్టడికే సెబీ నియమించిన కమిటీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ కమిటీ ఏడు నిర్ధిష్ట ప్రతిపాదనలు...

డెరివేటివ్స్‌ కట్టడి  కోసం కఠిన చర్యలు!

కోల్‌కతా: చిన్న మదుపరులు కొంప ముంచుతున్న డెరివేటివ్స్‌ కట్టడికే సెబీ నియమించిన కమిటీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ కమిటీ ఏడు నిర్ధిష్ట ప్రతిపాదనలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. వీటి ట్రేడింగ్‌ను హేతుబద్ధం చేయడం లేదా వీక్లీ ఆప్షన్లను పరిమితం చేయడం, స్ర్టైక్‌ ప్రైస్‌ను హేతుబద్ధం చేయడం వంటి చర్యలను సెబీ నిపుణుల కమిటీ సిఫారసు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. పొజిషన్ల పరిమితిని ఇంట్రా డేలో పర్యవేక్షించడం, లాట్‌ సైజలు పెంచడం, కాంట్రాక్టు తుది గడువు దగ్గరపడేటప్పుడు మార్జిన్లు పెంచడం వంటి చర్యలను కూడా సెబీ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. స్వల్పకాలిక లాభాల కోసం ఇటీవల పెద్ద ఎత్తున రిటైల్‌ మదుపరులు ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ)లో ట్రేడింగ్‌ చేస్తున్నారు. నష్టభయాలపై సరైన అవగాహన లేక, ఈ ట్రేడింగ్‌లో నూటికి 90 శాతం మంది నష్టపోతున్నారు. దీంతో ఈ ట్రేడింగ్‌ జరిపే రిటైల్‌ మదుపరులను కట్టడి చేయాలని సెబీ యోచిస్తోంది.

Updated Date - Jul 08 , 2024 | 06:18 AM