Share News

Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. భారీగా లాభపడిన దేశీయ సూచీలు!

ABN , Publish Date - Apr 08 , 2024 | 04:49 PM

కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశీయ సూచీలు జోరు చూపిస్తున్నాయి. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. ఈ రోజు (సోమవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు వస్తుండడం దేశీయ సూచీలకు కలిసివస్తోంది.

Stock Market: సెన్సెక్స్ సరికొత్త రికార్డు.. భారీగా లాభపడిన దేశీయ సూచీలు!

కొత్త ఆర్థిక సంవత్సరంలో దేశీయ సూచీలు (Stock Market) జోరు చూపిస్తున్నాయి. సరికొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి (Sensex Record). ఈ రోజు (సోమవారం) దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను ఆర్జించాయి. విదేశీ మదుపరుల పెట్టుబడులు వస్తుండడం దేశీయ సూచీలకు కలిసివస్తోంది. ఈ నేపథ్యంలో మన స్టాక్ మార్కెట్లు ఈ రోజు రెండు కొత్త రికార్డులను నమోదు చేశాయి. సెన్సెక్స్ జీవన కాల గరిష్టం వద్ద రోజును ముగించింది (Business News).


74,555 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ ఒక దేశలో 74,869 వద్ద ఇంట్రాడే హైకి చేరింది. ఆ తర్వాత కొద్దిగా క్షీణించినప్పటికీ తొలిసారి 74,700 పైన రోజును ముగించింది. 494 పాయింట్ల లాభంతో 74,742 వద్ద స్థిరపడింది. ఇక, నిఫ్టీ కూడా 152 పాయింట్లు లాభపడి 22,666 వద్ద రోజును ముగించింది. ఇక, బీఎస్‌లో నమోదిత కంపెనీల మొత్తం విలువ తొలిసారి రూ.400 లక్షల కోట్లను దాటి మరో రికార్డును సృష్టించింది.


సెన్సెక్స్‌లో ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాలను కళ్లజూశాయి. అలాగే నెస్లే ఇండియా, సన్‌ఫార్మా, విప్రో, టైటాన్ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇక, బ్యాంక్ నిఫ్టీ 88 పాయింట్లతో రోజును ముగించింది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్ప లాభాలను ఆర్జించింది.

ఇవి కూడా చదవండి..

Gold Price: బంగారం ధర పెరగడానికి ఐదు కారణాలు.. ఏంటంటే..?


Bike: మీ బైక్ పెట్రోల్ ఎక్కువ తాగుతుందా.. అయితే ఈ తప్పులు చేయకండి


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 08 , 2024 | 04:49 PM