Share News

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ‘లాభాల’ రికార్డ్‌

ABN , Publish Date - May 20 , 2024 | 04:50 AM

ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల్లో ఒకటిగా చెప్పబడే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గత ఆర్థిక సంవత్సరం (2023-24) రికార్డు స్థాయిలో 198 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,503 కోట్లు) లాభాలు...

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ‘లాభాల’ రికార్డ్‌

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యుత్తమ విమానయాన సంస్థల్లో ఒకటిగా చెప్పబడే సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ గత ఆర్థిక సంవత్సరం (2023-24) రికార్డు స్థాయిలో 198 కోట్ల డాలర్ల (సుమారు రూ.16,503 కోట్లు) లాభాలు ఆర్జించింది. దీంతో ఉద్యోగులకు ఎనిమిది నెలల జీతం బోనస్‌గా చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. ఒక విమానయాన సంస్థ ఉద్యోగులకు ఇంత పెద్ద మొత్తం బోనస్‌గా చెల్లించాలని నిర్ణయించడం ఇదే మొదటిసారి. కొవిడ్‌ భయాలు పోయి చైనా, జపాన్‌, హాంకాంగ్‌, తైవాన్‌లకు విమాన ప్రయాణం ఊపందుకోవడం గత ఆర్థిక సంవత్సరం సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ లాభాలకు బాగా కలిసొచ్చింది. ‘మా ఉద్యోగుల అంకిత భావం వల్లే కొవిడ్‌ ఉపద్రవాన్ని తట్టుకుని మేము మరింత బలోపేతంగా ఎదిగాము’ అని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సీఈఓ గో చూన్‌ చెప్పారు. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మాత్రం పరిస్థితులు అంత బాగుండకపోవచ్చన్నారు.

Updated Date - May 20 , 2024 | 04:50 AM