రూ.2000 తగ్గిన వెండి ధర
ABN , Publish Date - Sep 10 , 2024 | 02:50 AM
ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.700 తగ్గి రూ.73,500కు దిగివచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.2,000 తగ్గుదలతో రూ.83.800 ధర పలికింది...
న్యూఢిల్లీ: ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ.700 తగ్గి రూ.73,500కు దిగివచ్చింది. కిలో వెండి ఏకంగా రూ.2,000 తగ్గుదలతో రూ.83.800 ధర పలికింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ కమోడిటీ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) బంగారం ఒకదశలో 2,522.90 డాలర్లు, వెండి 28.44 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.
మళ్లీ లాభాల్లోకి మార్కెట్
గతవారం వరుసగా 4 రోజులు నష్టపోయిన ఈక్విటీ మార్కెట్ సోమవా రం మళ్లీ లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్ 375.61 పాయింట్ల వృద్ధితో 81,559.54 వద్ద ముగిసింది. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. నిఫ్టీ సైతం 84.25 పాయింట్లు పెరిగి 24,936.40 వద్ద స్థిరపడింది.