ఏపీలో శ్రీ సిమెంట్ ప్లాంట్
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:11 AM
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో శ్రీ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసిన సిమెంట్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కంపెనీ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది...

దాచేపల్లి యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో శ్రీ సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసిన సిమెంట్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. ఏటా 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో కంపెనీ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేసింది. నిర్ణీత గడువు కంటే 6 నెలల ముందే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంఽభించినట్టు తెలిపింది. ఈ ప్లాంట్ ద్వారా 700 మందికి ప్రత్యక్షంగా, 1,300 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. తెలంగాణ సరిహద్దుకు చేరువలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో తన సత్తా చాటాలని శ్రీ సిమెంట్ బావిస్తోంది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ నుంచి కాలుష్యం కూడా పెద్దగా వెలువడదని తెలిపింది.