Share News

రెడీమిక్స్‌ కాంక్రీట్‌లోకి శ్రీ సిమెంట్‌

ABN , Publish Date - Mar 23 , 2024 | 01:31 AM

బంగూర్‌ ప్యామిలీ ప్రమోట్‌ చేసిన శ్రీ సిమెంట్‌ రెడీమిక్స్‌ కాంక్రీట్‌ (ఆర్‌ఎంసీ) రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం బంగూర్‌ కాంక్రీట్‌ పేరుతో హైదరాబాద్‌లో గంటకు 90 క్యూబిక్‌ మీటర్ల ఉత్పత్తి సామర్ధ్యంతో తన తొలి ఆర్‌ఎంసీ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది.

రెడీమిక్స్‌ కాంక్రీట్‌లోకి శ్రీ సిమెంట్‌

హైదరాబాద్‌లో తొలి ప్లాంట్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: బంగూర్‌ ప్యామిలీ ప్రమోట్‌ చేసిన శ్రీ సిమెంట్‌ రెడీమిక్స్‌ కాంక్రీట్‌ (ఆర్‌ఎంసీ) రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం బంగూర్‌ కాంక్రీట్‌ పేరుతో హైదరాబాద్‌లో గంటకు 90 క్యూబిక్‌ మీటర్ల ఉత్పత్తి సామర్ధ్యంతో తన తొలి ఆర్‌ఎంసీ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. కంపెనీ త్వరలో ముంబై ఆర్‌ఎంసీ మార్కెట్లోకీ ప్రవేశించబోతుంది. ఇందుకోసం స్టార్‌క్రెట్‌ ఎల్‌ఎల్‌పీకి చెందిన ఐదు ఆర్‌ఎంసీ ప్లాంట్ల ను ఈ నెలారంభంలో రూ.33.5 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో తమ ఆర్‌ఎంసీ ప్లాంట్ల మొత్తం ఉత్పత్తి సామర్ధ్యం గంటకు 512 క్యూబిక్‌ మీటర్లకు చేరుకుందని తెలిపింది. రెడీమిక్స్‌ కాంక్రీట్‌ రంగంలో ఉన్న వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టు శ్రీ సిమెంట్‌ ఎండీ నీరజ్‌ అఖోరి తెలిపారు. శ్రీ సిమెంట్‌.. బంగూర్‌ బ్రాండ్‌ కింద దేశవ్యాప్తంగా సిమెంట్‌ను విక్రయిస్తోంది.

Updated Date - Mar 23 , 2024 | 01:42 AM