Share News

భారత్‌లో షార్ప్‌ డిస్‌ప్లే ప్లాంట్‌

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:07 AM

జపాన్‌కు చెందిన ఎలకా్ట్రనిక్‌ కంపెనీ షార్ప్‌ సుమారు 300-500 కోట్ల డాలర్ల (రూ.25,000 -42,000 కోట్లు) మేర పెట్టుబడులతో భారత్‌లో అత్యాధునిక (సిరీస్‌ 10) డిజిటల్‌ తెరల (డి్‌సప్లే) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే...

భారత్‌లో షార్ప్‌ డిస్‌ప్లే ప్లాంట్‌

1,000 ఎకరాల్లో ఏర్పాటు యోచన

రూ.25,000-42,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం

  • యూనిట్‌ ఏర్పాటుకు స్థలం కోసం

తెలంగాణ సహా పలు రాష్ట్రాలతో చర్చలు

న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ఎలకా్ట్రనిక్‌ కంపెనీ షార్ప్‌ సుమారు 300-500 కోట్ల డాలర్ల (రూ.25,000 -42,000 కోట్లు) మేర పెట్టుబడులతో భారత్‌లో అత్యాధునిక (సిరీస్‌ 10) డిజిటల్‌ తెరల (డి్‌సప్లే) తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇందుకోసం షార్ప్‌ ఉన్నతాధికారులు ఈ వారంలో కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసినట్లు ఓ ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది. ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ప్లాంట్‌ కంటే పెద్దగా, 1,000 ఎకరాల స్థలంలో భారత యూనిట్‌ను ఏర్పాటు చేయాలని షార్ప్‌ భావిస్తోంది. తద్వారా భారత మార్కెట్‌ అవసరాలు తీర్చడంతో పాటు ఇతర దేశాలకూ ఇక్కడి నుంచే డిస్‌ప్లే యానిట్లను ఎగుమతి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన స్థల సమీకరణ కోసం తెలంగాణతో పాటు గుజరాత్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ షార్ప్‌ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నందున షార్ప్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతులు లభించేందుకు మరో 10 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం షార్ప్‌ కంపెనీ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది.

దేశంలో సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు కేంద్రం 1,000 కోట్ల డాలర్ల విలువైన భారీ ప్రోత్సాహకాల పథకాన్ని ప్రకటించింది. షార్ప్‌ కంటే ముందు ఇజ్రాయెల్‌కు చెందిన చిప్‌ తయారీ సంస్థ టవర్‌ సెమీకండక్టర్స్‌ సైతం రూ.90,000 కోట్ల పెట్టుబడులతో భారత్‌లో ఫ్యాబ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనుమతి కోసం ప్రభుత్వాన్ని సంప్రదించింది.

Updated Date - Apr 28 , 2024 | 02:07 AM