Share News

టెస్లాకు పోటీగా షామీ కారు..

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:57 AM

చవక స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులకు పేరుగాంచిన చైనా కంపెనీ షామీ.. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకీ తనదైన శైలిలో అరంగేట్రం చేసింది. షామీ తన తొలి ఎలక్ట్రిక్‌ ప్రీమియం సెడాన్‌ కారు...

టెస్లాకు పోటీగా షామీ కారు..

టెస్లా మోడల్‌ 3 కంటే 30,000 యువాన్లు తక్కువ

  • ఎస్‌యూ7 విక్రయాలు ప్రారంభించిన కంపెనీ

  • ప్రారంభ ధర 2,15,900 యువాన్లు

బీజింగ్‌: చవక స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తులకు పేరుగాంచిన చైనా కంపెనీ షామీ.. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలోకీ తనదైన శైలిలో అరంగేట్రం చేసింది. షామీ తన తొలి ఎలక్ట్రిక్‌ ప్రీమియం సెడాన్‌ కారు ‘స్పీడ్‌ అలా్ట్ర 7’ (ఎస్‌యూ7) విక్రయాలను గురువారం ప్రారంభించింది. టెస్లా, బీవైడీ వంటి ప్రముఖ కంపెనీల ఈవీలకు పోటీగా మార్కెట్లోకి వస్తున్న ఈ కారు మూడు వేరియంట్లలో (స్టాండర్డ్‌, ప్రో, మ్యాక్స్‌), తొమ్మిది రంగుల్లో లభించనుంది. దీని ప్రారంభ ధర 29,870 డాలర్లు (చైనా కరెన్సీలో 2,15,900 యువాన్లు, మన కరెన్సీలో రూ.25 లక్షలు). టెస్లా మోడల్‌ 3 రేటు (2,45,900 యువాన్లు) కంటే 30,000 యువాన్లు తక్కువ ఇది. ప్రస్తుతం ఎస్‌యూ7ను చైనా మార్కెట్లో విక్రయించనున్న షామీ.. త్వరలో భారత్‌ సహా ఇతర మార్కెట్లలోకి అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

Updated Date - Mar 29 , 2024 | 02:57 AM