Share News

Stock Market: భారీగా నష్టపోయిన సూచీలు.. 73 వేల దిగువకు సెన్సెక్స్!

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:57 PM

దేశీయ సూచీలు భారీ నష్టాలను చవి చూశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో అన్ని రంగాల షేర్లూ భారీగా దిగజారాయి.

Stock Market: భారీగా నష్టపోయిన సూచీలు.. 73 వేల దిగువకు సెన్సెక్స్!

దేశీయ సూచీలు భారీ నష్టాలను చవి చూశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో అన్ని రంగాల షేర్లూ భారీగా దిగజారాయి. బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకోలేదు. అన్ని రంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తడంతో నిఫ్టీ 22 వేల దిగువకు చేరింది. ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, రియాల్టీ రంగాలు రెండు శాతానికి పైగానే నష్టపోయాయి.

బుధవారం ఉదయం 73,162 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఒక 900 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకు 790 పాయింట్లు దిగజారి 72,304 వద్ద క్లోజ్ అయింది. ఇక, 22,214 పాయింట్ల వద్ద మొదలైన నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 21,951 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్స్, ఎయిచర్ మోటార్స్, మారుతీ సుజికీ షేర్లు భారీగా నష్టపోయాయి. హెయూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రోజు ఏకంగా 952 పాయింట్లు కోల్పోయింది.

Updated Date - Feb 28 , 2024 | 03:57 PM