Share News

Stock Market : నిఫ్టీ @ 23,000

ABN , Publish Date - May 25 , 2024 | 05:59 AM

వరుసగా రెండో రోజూ ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకాయి. వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 218.46 పాయింట్లు పెరిగి 75,636.50 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. అయితే, చివర్లో మదుపరులు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు

Stock Market : నిఫ్టీ @ 23,000

ఇంట్రాడేలో 75,600 ఎగువకు సెన్సెక్స్‌

సరికొత్త గరిష్ఠాలకు ఈక్విటీ సూచీలు

లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగింపు

ముంబై: వరుసగా రెండో రోజూ ప్రామాణిక ఈక్విటీ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠాలకు ఎగబాకాయి. వారాంతం (శుక్రవారం) ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 218.46 పాయింట్లు పెరిగి 75,636.50 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. అయితే, చివర్లో మదుపరులు ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్‌ రంగ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో సూచీ 7.65 పాయింట్ల నష్టంతో 75,410.39 వద్ద ముగిసింది. కాగా, నిఫ్టీ తొలిసారిగా 23,000 మైలురాయిని దాటింది. ఒక దశలో 58.75 పాయింట్లు వృద్ధి చెంది 23,026.40 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. కానీ, చివరికి 10.55 పాయింట్ల నష్టంతో 22,957.10 వద్ద స్థిరపడింది. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.419.99 లక్షల కోట్లు (5.05 లక్షల కోట్ల డాలర్లు), నిఫ్టీ మార్కెట్‌ క్యాప్‌ రూ.416 లక్షల కోట్లు (5.01 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. కాగా, ఈ వారంలో సెన్సెక్స్‌ 1,404.45 పాయింట్లు (1.89 శాతం), నిఫ్టీ 455.1 పాయింట్లు (2 శాతం) పుంజుకుంది.

మరింత తగ్గిన పసిడి: దేశీయంగా విలువైన లోహాల ధరలు వరుసగా మూడో రోజూ తగ్గాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర శుక్రవారం రూ.900 తగ్గి రూ.72,650 వద్దకు దిగివచ్చింది. కిలో వెండి సైతం రూ.500 తగ్గుదలతో రూ.92,100 వద్దకు జారుకుంది. అంతర్జాతీయంగా వీటి రేట్లు తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ సెంటర్‌లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ ఒక దశలో 2,340 డాలర్లు, సిల్వర్‌ 30.45 డాలర్ల స్థాయికి తగ్గాయి.


ఫారెక్స్‌ నిల్వల్లో సరికొత్త రికార్డు: ఈనెల 17తో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు మరో 455 కోట్ల డాలర్ల మేర పెరిగి సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 64,870 కోట్ల డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. ఫారెక్స్‌ నిల్వలు పెరగడం వరుసగా ఇది మూడో వారం.

రుల్కా ఎలక్ట్రికల్స్‌ లిస్టింగ్‌ అదుర్స్‌

ముంబైకి చెందిన రుల్కా ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ శుక్రవారం షేర్లను ఎన్‌ఎ్‌సఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసింది. ఐపీఓ ధర రూ.235తో పోలిస్తే, కంపెనీ షేరు ఽ123.40 శాతం ప్రీమియంతో రూ.525 వద్ద లిస్టయింది. చివరికి 118.4 శాతం లాభంతో రూ.498.75 వద్ద ముగిసింది. తొలిరోజు ట్రేడింగ్‌ ముగిసేసరికి, కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.212.39 కోట్లుగా నమోదైంది. ఈ మంగళవారంతో ముగిసిన కంపెనీ ఐపీఓకు ఏకంగా 676.83 రెట్ల సబ్‌స్ర్కిప్షన్‌ లభించింది.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ మార్కెట్‌ విలువ..

10,000 కోట్ల డాలర్లు

ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్‌లోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ తొలిసారిగా 10,000 కోట్ల డాలర్ల (రూ.8.51 లక్షల కోట్లు) స్థాయిని దాటింది. ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీల జాబితాలో అలా్ట్రటెక్‌ సిమెంట్‌, గ్రాసిమ్‌, హిందాల్కో, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఏఎంసీ, వొడాఫోన్‌ ఐడియా, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌, టీసీఎన్‌ఎ్‌స క్లోతింగ్‌, ఆదిత్య బిర్లా మనీ, సెంచురీ టెక్స్‌టైల్స్‌, సెంచురీ ఎంకా అండా పిలానీ ఇన్వె్‌స్టమెంట్‌ ఉన్నాయి. గ్రూప్‌లోని పలు కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ గడిచిన ఏడాది కాలంలో 2-3 రెట్ల వరకు వృద్ధి చెందాయి.

Updated Date - May 25 , 2024 | 05:59 AM