Share News

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:47 AM

ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎం సీజీ), ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శనివారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలను చేజార్చుకున్న సెన్సెక్స్‌ చివరికి...

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలు

260 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌

ముంబై: ఫాస్ట్‌ మూవింగ్‌ కన్స్యూమర్‌ గూడ్స్‌ (ఎఫ్‌ఎం సీజీ), ఐటీ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో శనివారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఆరంభ లాభాలను చేజార్చుకున్న సెన్సెక్స్‌ చివరికి 259.58 పాయింట్ల నష్టంతో 71,423.65 వద్దకు జారుకుంది. నిఫ్టీ 50.60 పాయింట్లు కోల్పోయి 21,571.80 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 24 నష్టపోయాయి. హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేరు 3.72 శాతం పతనమై సూచీ టాప్‌ లూజర్‌గా మిగిలింది. టీసీఎస్‌ 2.07 శాతం తగ్గగా.. ఎం అండ్‌ ఎం, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, నెస్లే, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ ఒక శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. శుక్రవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 0.80 శాతం నష్టపోయింది.

మెగాథర్మ్‌ ఇండక్షన్‌ ఐపీఓ ధర శ్రేణి రూ.100-108: మెషినరీ తయారీదారు మెగాథర్మ్‌ ఇండక్షన్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ఈ నెల 25న ప్రారంభమై 30న ముగియనుంది. ఐపీఓలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.100 -108గా నిర్ణయించింది. ఇష్యూలో భాగంగా 49.92 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించనున్న కంపె నీ.. గరిష్ఠ ధర శ్రేణి ప్రకారంగా రూ.53.91 కోట్లు సమీకరించనుంది.

Updated Date - Jan 21 , 2024 | 01:47 AM