Share News

కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌పై సెబీ వేటు

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:49 AM

కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ (కేఐఎస్‌ఎల్‌)పై మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరోసారి కొరడా ఝళిపించింది. మర్చంట్‌ బ్యాంకర్‌గా ఆ సంస్థకు ఉన్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది..

కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌పై సెబీ వేటు

రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ రద్దు

న్యూఢిల్లీ: కార్వీ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ (కేఐఎస్‌ఎల్‌)పై మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ మరోసారి కొరడా ఝళిపించింది. మర్చంట్‌ బ్యాంకర్‌గా ఆ సంస్థకు ఉన్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. గురువారం దీనికి సంబంధించి 24 పేజీల ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది మార్చి 15-17 తేదీల్లో తాము జరిపిన తనిఖీల్లో సంస్థ పేర్కొన్న చిరునామాల్లో కార్యాలయాలు కూడా లేవని తెలిపింది. దీనికి తోడు మర్చంట్‌ బ్యాంకర్‌గా విధులు నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఉద్యోగులు, పరికరాలు కూడా కంపెనీ వద్ద లేవని పేర్కొంది. రిజిస్ట్రేషన్‌ రద్దుతో కేఐఎస్‌ఎల్‌ మర్చంట్‌ బ్యాంకర్‌గా విధులు నిర్వహించే అవకాశాన్నీ కోల్పోయింది.

Updated Date - Mar 29 , 2024 | 02:49 AM