Share News

డాయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ భాగస్వామ్యం

ABN , Publish Date - Mar 28 , 2024 | 02:02 AM

ఏరోస్పేస్‌ రంగానికి ఇన్నోవేటివ్‌ సొల్యూషన్లు అందించే హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ జర్మనీకి కంపెనీ డాయిష్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది...

డాయిష్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో సైయెంట్‌ భాగస్వామ్యం

హైదరాబాద్‌: ఏరోస్పేస్‌ రంగానికి ఇన్నోవేటివ్‌ సొల్యూషన్లు అందించే హైదరాబాద్‌కు చెందిన సైయెంట్‌ జర్మనీకి కంపెనీ డాయిష్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 40 సీట్ల సామర్థ్యం గల డీ 328ఈసీఓ రీజినల్‌ టర్బోప్రాప్‌ విమానం వెనుక భాగం డిజైనింగ్‌లో రెండు కంపెనీలు సహకరించుకుంటాయని సైయెంట్‌ తెలిపింది. డార్నియర్‌ 328 విమానానికి అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌ కావడం వల్ల అందుకు అనుగుణంగా విమానం ప్రధాన బాడీని డిజైన్‌ చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

Updated Date - Mar 28 , 2024 | 02:02 AM