మార్కెట్‌కు అమ్మకాల పోటు
ABN , Publish Date - Dec 31 , 2024 | 05:44 AM
ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, విదేశీ సంస్థల నిధుల తరలింపు నేపథ్యంలో సోమవారం ఈక్విటీ మార్కె ట్లో అమ్మకాలు పోటెత్తాయి. మార్కెట్ అగ్రగాములైన...

సెన్సెక్స్ 450 పాయింట్లు డౌన్
ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన బలహీన సంకేతాలు, విదేశీ సంస్థల నిధుల తరలింపు నేపథ్యంలో సోమవారం ఈక్విటీ మార్కె ట్లో అమ్మకాలు పోటెత్తాయి. మార్కెట్ అగ్రగాములైన హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ షేర్లలో భారీ ఎత్తున అమ్మకాలు సాగాయి. ఫలితంగా సెన్సెక్స్ 450.94 పాయింట్ల నష్టంతో 78,248.13 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లోని షేర్లలో 23 నష్టాలతోనే ముగిశాయి. నిఫ్టీ 168.50 పాయింట్ల నష్టంతో 23,644.90 వద్ద ముగిసింది. నిఫ్టీ షేర్లలో 38 నష్టాల్లోనే ముగిశాయి. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.
సెనోరెస్ ఫార్మా దూకుడు: ఇటీవల ఐపీఓ ముగించుకున్న సెనోరెస్ సోమవారం షేరు మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది. సెనోరెస్ ఫార్మా షేరు బీఎ్‌సఈలో ఇష్యూ ధర రూ.391పై 42.65 శాతం ప్రీమియంతో రూ.557.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేరు 55.75 శాతం ప్రీమియంతో రూ.609 వరకు కూడా దూసుకుపోయింది. ఎన్‌ఎ్‌సఈలో కూడా ఈ షేరు 42.46 శాతం లాభంతో రూ.557.05 వద్ద ముగిసింది.
ఏథర్ ఎనర్జీ ఇష్యూకు సెబీ ఆమోదం: పబ్లిక్ ఇష్యూ జారీ కోసం ఆరు కంపెనీలు చేసుకున్న దరఖాస్తులకు సెబీ ఆమోదముద్ర వేసింది. వాటిలో ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ ఇష్యూ కూడా ఉంది. ఈ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్ల విలువ గల తాజా ఈక్విటీ షేర్లు మార్కెట్లో జారీ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 2.2 కోట్ల షేర్లను విక్రయిస్తారు. ఇష్యూ ద్వారా సేకరించే నిధులు మహారాష్ట్రలో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు, రుణ భారం తగ్గించుకునేందుకు, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించుకోనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇష్యూ జారీ కోసం సెబీ ఆమోదం పొందిన ఇతర సంస్థల్లో లీలా ప్యాలెస్ మాతృసంస్థ స్కాలస్ బెంగళూరు, ఓస్వాల్ పంప్స్, ఐవాల్యూ సొల్యూషన్స్, క్వాలిటీ పవర్ ఎలక్ర్టికల్ ఎక్వి్‌పమెంట్స్, ఫ్యాబ్‌టెక్ టెక్నాలజీస్ ఇష్యూలున్నాయి.