అరబిందో అనుబంధ సంస్థ విక్రయం
ABN , Publish Date - Feb 06 , 2024 | 02:30 AM
నష్టాల్లో ఉన్న అమెరికాలోని తన అనుబంధ కంపెనీ ‘యుజియా యూఎస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్‌ఎల్‌సీని అరబిందో ఫార్మా విక్రయించింది. ఈ కంపెనీ వ్యాపార ఆస్తులు, అప్పులు, ఉద్యోగులతో...
హైదరాబాద్: నష్టాల్లో ఉన్న అమెరికాలోని తన అనుబంధ కంపెనీ ‘యుజియా యూఎస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్‌ఎల్‌సీని అరబిందో ఫార్మా విక్రయించింది. ఈ కంపెనీ వ్యాపార ఆస్తులు, అప్పులు, ఉద్యోగులతో కలిపి ఎంపవర్ క్లినిక్ సర్వీస్ న్యూజెర్సీ అనే కంపెనీకి 5.2 కోట్ల డాలర్లకు (సుమారు రూ.432 కోట్లు) విక్రయించింది. దీనికి తోడు ‘యుజియా యూఎస్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎల్‌ఎల్‌సీ, దాని అనుబంధ సంస్థల ఉత్పత్తి యూనిట్లను 20 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడం ద్వారా మరో 5.8 కోట్ల డాలర్లు (సుమారు రూ.482 కోట్లు) అరబిందో ఫార్మాకు లభిస్తాయి.