కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 5% వాటా విక్రయం
ABN , Publish Date - Oct 16 , 2024 | 04:44 AM
కేంద్ర ప్రభుత్వం.. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. షేరు కనీస ధరను రూ.1,540గా నిర్ణయించింది...
కేంద్ర ప్రభుత్వం.. కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 5 శాతం వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిన విక్రయించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. షేరు కనీస ధరను రూ.1,540గా నిర్ణయించింది. బుధవారం నుంచి వాటా విక్ర యం ప్రారంభం కానుందని.. రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థ ఉద్యోగులు గురువారం బిడ్ వేయవచ్చని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ డిపార్ట్‌మెంట్ (దీపం) వెల్లడించింది. కంపెనీలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది. ప్రస్తుతం కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో కేంద్ర ప్రభుత్వం 72.86 శాతం వాటా కలిగి ఉంది.