Share News

రూ.3.15 లక్షల కోట్లు ఆవిరి

ABN , Publish Date - Mar 12 , 2024 | 05:01 AM

స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల ర్యాలీకి తెరపడింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 616.75 పాయింట్లు నష్టపోయి 73,502.64 వద్దకు జారుకుంది. నిఫ్టీ 160.90 పాయింట్ల పతనంతో 22,332.65 వద్ద క్లోజైంది...

రూ.3.15 లక్షల కోట్లు ఆవిరి

617 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

చిన్న కంపెనీల షేర్లు విల విల

ముంబై: స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల ర్యాలీకి తెరపడింది. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 616.75 పాయింట్లు నష్టపోయి 73,502.64 వద్దకు జారుకుంది. నిఫ్టీ 160.90 పాయింట్ల పతనంతో 22,332.65 వద్ద క్లోజైంది. అంతర్జాతీయ మార్కెట్లో ట్రేడింగ్‌ ట్రెండ్‌ బలహీనంగా ఉండటంతో దేశీయంగానూ మదుపరులు బ్యాంకింగ్‌, లోహ రంగ షేర్లలో పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణం. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న షేర్లలో అమ్మకాలు పోటెత్తాయి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 22 నష్టపోయాయి. బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఒక్కరోజులోనే రూ.3.15 లక్షల కోట్లు తగ్గి రూ.389.66 లక్షల కోట్లకు (4.75 లక్షల కోట్ల డాలర్లు) పరిమితమైంది.

మరిన్ని విషయాలు..

  • ఎలక్టోరల్‌ బాండ్ల డేటాను ఈనెల 12న విడుదల చేయాల్సిందేనని సుప్రీంకోర్టు ఎస్‌బీఐని ఆదేశించిన నేపథ్యంలో బ్యాంక్‌ షేరు 1.86 శాతం క్షీణించి రూ.773.50 వద్ద ముగిసింది.

  • జేఎం ఫైనాన్షియల్‌ లిమిటెడ్‌ షేరు 10 శాతం పతనమై రూ.9.77 వద్ద ముగిసింది. నియంత్రణ నియమావళిని ఉల్లంఘించినందుకు గాను కొత్తగా డెట్‌ సెక్యూరిటీ ఇష్యూలకు లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరించకుండా జేఎం ఫైనాన్షియల్‌పై సెబీ నిషేధం విధించడం ఇందుకు కారణం.

  • బిట్‌కాయిన్‌ సరికొత్త రికార్డు స్థాయి 72,000 డాలర్లకు చేరుకుంది. అమెరికాతోపాటు తాజాగా యూకే సైతం క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల(ఈటీఎఫ్‌) ట్రేడింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం ఇందుకు కారణమైంది.

  • క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ ఐపీఓ ధరల శ్రేణిని రూ.680-715గా నిర్ణయించింది.

Updated Date - Mar 12 , 2024 | 06:44 AM