Share News

అజాద్‌ ఇంజనీరింగ్‌తో రోల్స్‌ రాయిస్‌ ఒప్పందం

ABN , Publish Date - Jan 30 , 2024 | 05:16 AM

రక్షణ రంగానికి అవసరమైన ఏరో ఇంజన్‌ విడిభాగాలు తయారు చేయడంలో సహకారానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన అజాద్‌ ఇంజనీరింగ్‌తో రోల్స్‌-రాయిస్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది...

అజాద్‌ ఇంజనీరింగ్‌తో రోల్స్‌ రాయిస్‌ ఒప్పందం

హైదరాబాద్‌: రక్షణ రంగానికి అవసరమైన ఏరో ఇంజన్‌ విడిభాగాలు తయారు చేయడంలో సహకారానికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన అజాద్‌ ఇంజనీరింగ్‌తో రోల్స్‌-రాయిస్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ దీర్ఘకాలిక ఒప్పందం కింద అజాద్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ రక్షణ విమానాల ఇంజన్ల విడిభాగాలు తయారు చేసి సరఫరా చేస్తుంది. ఆ రకంగా రోల్స్‌ రాయి్‌సకు చెందిన సాంకేతికంగా ఆధునికమైన ఏరో ఇంజన్ల ప్రపంచ సరఫరా విభాగంలో ఒక భాగస్వామిగా మారుతుంది. అజాద్‌ ఇంజనీరింగ్‌ భాగస్వామ్యంలో తాము భారతదేశంలో సరఫరా వ్యవస్థను విస్తరించాలనుకుంటున్నామని రోల్స్‌-రాయిస్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అలెక్స్‌ జినో అన్నారు. దేశంలో తయారీ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న తమ లక్ష్యం సైతం దీనితో తీరుతుందని ఆయన తెలిపారు. అత్యంత సంక్లిష్టమైన ఈ విడిభాగాల తయారీని భారత్‌కు తీసుకురావడం తమ సామర్థ్యాలకు నిదర్శనమే కాదు... భారత ఏరోస్పేస్‌, రక్షణ పరిశ్రమకు అత్యంత కీలకం అని అజాద్‌ ఇంజనీరింగ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రాకేశ్‌ చోప్దార్‌ అన్నారు. అత్యాధునిక తయారీ విభాగాల్లో నానాటికీ పెరుగుతున్న భారతదేశ శక్తిని ఇది నిరూపిస్తున్నదని ఆయన చెప్పారు.

Updated Date - Jan 30 , 2024 | 05:16 AM