ప్రముఖ బ్యాంకర్ రాణా తల్వార్ కన్నుమూత
ABN , Publish Date - Jan 29 , 2024 | 05:50 AM
ప్రముఖ బ్యాంర్ రాణా తల్వార్ కన్ను మూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు సారథ్యం వహించడం ద్వారా ఒక అంతర్జాతీయ బ్యాంకుకు సారథ్యం వహించిన తొలి భారతీయుడుగా...
న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాంర్ రాణా తల్వార్ కన్ను మూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఆయన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్‌కు సారథ్యం వహించడం ద్వారా ఒక అంతర్జాతీయ బ్యాంకుకు సారథ్యం వహించిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు. ఆయన డీఎల్‌ఎఫ్ గ్రూప్ చైర్మన్ కేపీ సింగ్ అల్లుడు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. డీఎల్‌ఎఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న తల్వార్ శనివారం మరణించారని కంపెనీ ఒక రెగ్యులేటరీ ప్రకటనలో తెలిపింది.