Share News

ఐపీఓ నిబంధనల సడలింపు

ABN , Publish Date - May 22 , 2024 | 05:32 AM

కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను సడలించింది. ఐపీఓ పత్రాలు సమర్పించాక ఇష్యూ సైజు...

ఐపీఓ నిబంధనల సడలింపు

న్యూఢిల్లీ: కంపెనీల పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ) ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ నిబంధనలను సడలించింది. ఐపీఓ పత్రాలు సమర్పించాక ఇష్యూ సైజు తగ్గింపు లేదా పెంచుకునే విషయంలో మరింత వెసులుబాటు కల్పించింది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) సైజు మారితే మళ్లీ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం రూపాయల్లో ఇష్యూ సైజు లేదా విక్రయించనున్న షేర్ల సంఖ్యలో ఒక దానిపైనే ఆధారపడి ఉంటుందని సెబీ తెలిపింది.


మరిన్ని విషయాలు: మినిమమ్‌ ప్రమోటర్స్‌ కాంట్రిబ్యూషన్‌ (ఎంపీసీ) తగ్గిన పక్షంలో ప్రమోటర్‌గా గుర్తింపు లేకపోయినప్పటికీ, పబ్లిక్‌ ఆఫరింగ్‌ ముగిశాక ఈక్విటీ వాటాలో 5 శాతానికి మించి వాటా కలిగి ఉండే ప్రమోటర్‌ గ్రూప్‌ కంపెనీలు, వ్యక్తిగతేతర షేర్‌హోల్డర్లు కూడా ఎంపీసీ పరిమితి లోటును భర్తీ చేసేందుకు సెబీ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఎంపీసీ పరిమితి 20 శాతంగా ఉంది. సాధారణంగా ఎంటర్‌ప్రెన్యూర్లు ప్రమోట్‌ చేసే కంపెనీలు స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదుకు ముందే ఆయా మార్గాల్లో, పలు విడతల్లో ఫండింగ్‌ సేకరిస్తుంటాయి. ఆ సందర్భాల్లో ప్రమోటర్ల వాటా 20 శాతం ఎంపీసీ పరిమితి కంటే తగ్గవచ్చు. అయినప్పటికీ, ఐపీఓకు వచ్చేందుకు కొత్త నిబంధన దోహదపడనుంది.

  • ప్రాథమిక ముసాయిదా పత్రాలను (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించిన తేదీకి ఏడాది ముందే కంపల్సర్లీ కన్వర్టబుల్‌ సెక్యూరిటీ్‌సను మార్చుకోవడం ద్వారా లభించిన ఈక్విటీ షేర్ల వాటాను సైతం ఎంపీసీ పరిమితి అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చని సెబీ తెలిపింది.

  • ఏదైనా అసాధారణ పరిస్థితులు లేదా సందర్భంలో ఐపీఓ క్లోజింగ్‌ తేదీని ఒక రోజే పొడిగించే వెసులుబాటు కల్పించింది సెబీ. ఇప్పటివరకు కనీసం మూడు రోజులు పొడిగించాల్సి వచ్చేది.

Updated Date - May 22 , 2024 | 05:33 AM