Share News

తగ్గిన ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభం

ABN , Publish Date - Apr 25 , 2024 | 05:22 AM

ఐటీ రంగంలోని ఎల్‌టీఐమైండ్‌ట్రీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభంలో 1.2 శాతం క్షీణతను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే...

తగ్గిన ఎల్‌టీఐమైండ్‌ట్రీ లాభం

ముంబై: ఐటీ రంగంలోని ఎల్‌టీఐమైండ్‌ట్రీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక లాభంలో 1.2 శాతం క్షీణతను నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం రూ.1,114.1 కోట్ల నుంచి రూ.1,100.7 కోట్లకు తగ్గింది. ఆదాయం మాత్రం 2.32 శాతం వృద్ధితో రూ.8,691 కోట్ల నుంచి రూ.8,892.9 కోట్లకు పెరిగింది. కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం రూ.35,537 కోట్లు కాగా లాభం రూ.4,584.6 కోట్లుగా నమోదైంది.

Updated Date - Apr 25 , 2024 | 05:22 AM