అందుబాటు ధరల ఇళ్లకు తగ్గిన గిరాకీ
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:11 AM
దేశంలో రూ.60 లక్షల వరకు ధర ఉండే అందుబాటు ధరల ఇళ్లకు గిరాకీ తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ కేటగిరిలోకి వచ్చే...

ప్రాప్‌ఈక్విటీ
న్యూఢిల్లీ: దేశంలో రూ.60 లక్షల వరకు ధర ఉండే అందుబాటు ధరల ఇళ్లకు గిరాకీ తగ్గుతోంది. ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌తో సహా దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ కేటగిరిలోకి వచ్చే ఇళ్ల అమ్మకాలు 61,121 యూనిట్లు మించలేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది నాలుగు శాతం తక్కువని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ తెలిపింది. లగ్జరీ అపార్ట్‌మెంట్లకు గిరాకీ పెరగడం, అందుబాటు ధరల గృహల సరఫరా మందగించడం ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం బిల్డర్లు ఎక్కువగా అధిక లాభాలు ఉండే లగ్జరీ అపార్ట్‌మెంట్ల నిర్మాణంపైనే ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో హైదరాబాద్‌లో 3,674 అందుబాటు ధరల గృహాలు అమ్ముడుపోగా ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 3,360 గృహాలు మాత్రమే అమ్ముడు పోయాయని ప్రాప్‌టైగర్ తెలిపింది.