Share News

మార్కెట్లోకి రియల్‌మీ జీటీ 7 ప్రో

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:56 AM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రియల్‌మీ తాజాగా ‘జీటీ 7 ప్రో’ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ఫ్లాగ్‌షిప్‌ చిప్‌సెట్‌తో దేశీయ విపణిలోకి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ ఇదే...

మార్కెట్లోకి రియల్‌మీ జీటీ 7 ప్రో

ప్రారంభ ధర రూ.56,999

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రియల్‌మీ తాజాగా ‘జీటీ 7 ప్రో’ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ఫ్లాగ్‌షిప్‌ చిప్‌సెట్‌తో దేశీయ విపణిలోకి వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ ఇదే. దీని (12జీబీ ర్యామ్‌+256 జీబీ మెమొరీ) ప్రారంభ ధర రూ.59,999 కాగా, 16జీబీ ర్యామ్‌+ 512 జీబీ మెమొరీ సామర్థ్యంతో కూడిన మోడల్‌ రేటు రూ.65,999. ఈనెల 29 నుంచి అమెజాన్‌, రియల్‌మీ వెబ్‌సైట్లతోపాటు ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ ఫోన్‌ అందుబాటులోకి వస్తుంది. లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా కంపెనీ ఈ ఫోన్‌పై రూ.3,000 బ్యాంక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈనెల 28 కల్లా బుక్‌ చేసుకున్న వారికి ఏడాది అదనపు వారెంటీ కూడా కల్పిస్తోంది.

Updated Date - Nov 28 , 2024 | 04:56 AM