Share News

క్యూ4 జీడీపీ వృద్ధి రేటు 6.7% !

ABN , Publish Date - May 27 , 2024 | 02:35 AM

ఈ నెల 31న వెలువడే మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక (క్యూ4) జీడీపీ వృద్ధి రేటుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ త్రైమాసికానికి వృద్ధి రేటు 6.1 నుంచి 6.7% మధ్య ఉండే అవకాశం...

క్యూ4 జీడీపీ వృద్ధి రేటు 6.7% !

న్యూఢిల్లీ : ఈ నెల 31న వెలువడే మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసిక (క్యూ4) జీడీపీ వృద్ధి రేటుపై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఈ త్రైమాసికానికి వృద్ధి రేటు 6.1 నుంచి 6.7% మధ్య ఉండే అవకాశం ఉందని ఆర్థికవేత్తల అంచనా. గడిచిన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరు మధ్య కాలానికి నమోదైన 8 శాతంతో పోలిస్తే ఇది తక్కువే. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి మా త్రం జీడీపీ వృద్ధి రేటు 7.6 నుంచి 7.8ు మధ్య ఉంటుందని భావిస్తున్నారు. దేశ జీడీపీ జూన్‌ త్రైమాసికంలో 8.2ు, సెప్టెంబరు త్రైమాసికంలో 8.1ు, డిసెంబరు త్రైమాసికంలో 8.4ుచొప్పున వృద్ధిరేటు నమోదు చేసింది.

Updated Date - May 27 , 2024 | 02:35 AM