Share News

బెటర్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్‌లో పీవీ సింధు పెట్టుబడి

ABN , Publish Date - Jun 04 , 2024 | 04:30 AM

రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత, షట్లర్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు గ్రీన్‌డేకు చెందిన ‘‘బెటర్‌ న్యూట్రిషన్‌’’ బ్రాండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారు...

బెటర్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్‌లో పీవీ సింధు పెట్టుబడి

న్యూఢిల్లీ: రెండు సార్లు ఒలింపిక్‌ పతక విజేత, షట్లర్‌లో ప్రపంచ చాంపియన్‌ పీవీ సింధు గ్రీన్‌డేకు చెందిన ‘‘బెటర్‌ న్యూట్రిషన్‌’’ బ్రాండ్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. ఆ బ్రాండ్‌కు ప్రచారకర్తగా కూడా వ్యవహరించనున్నారు. సింధు సోమవారం ఈ విషయం ప్రకటించారు. అయితే ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారనే విషయం మాత్రం వెల్లడించలేదు. గ్రీన్‌డే సంస్థ బయోఫోర్టిఫైడ్‌ ఆహారాల ద్వారా పోషకాహార లోపాలపై పోరాటానికి ఈ బ్రాండ్‌ను ప్రారంభించింది. దేశంలో పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న బ్రాండ్‌లో తాను భాగస్వామి కావడం ఆనందకరమైన అంశమని సింధు తెలిపారు. అహ్మదాబాద్‌ ఐఐఎం పూర్వ విద్యార్థులైన రస్తోగి, ఐశ్వర్య భట్నాగర్‌ గ్రీన్‌డే సంస్థను ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 04:30 AM