Share News

రిలయన్స్‌, ఇన్ఫీ షేర్లలో కొనుగోళ్లు

ABN , Publish Date - May 23 , 2024 | 05:52 AM

అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లలో కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ సూచీలను ముందుకు నడిపించాయి. బుధవారం ట్రేడింగ్‌ నిలిచేసరికి...

రిలయన్స్‌, ఇన్ఫీ షేర్లలో కొనుగోళ్లు

  • సెన్సెక్స్‌ 267 పాయింట్లు అప్‌

  • 5 లక్షల కోట్ల డాలర్లు దాటిన మార్కెట్‌ సంపద

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లలో కొనుగోళ్లు దేశీయ ఈక్విటీ సూచీలను ముందుకు నడిపించాయి. బుధవారం ట్రేడింగ్‌ నిలిచేసరికి, సెన్సెక్స్‌ 267.75 పాయింట్ల లాభంతో 74,221.06 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 68.75 పాయింట్ల వృద్ధితో 22,597.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ లాభపడటం వరుసగా ఇది ఐదో రోజు. కాగా బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ సంపద తొలిసారిగా 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.415.94 లక్షల కోట్లు) వద్ద ముగిసింది. బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌కు ఇది సరికొత్త ఆల్‌టైం గరిష్ఠ స్థాయి.

బీకన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌ షేరు ధర శ్రేణి రూ.57-60

ప్రముఖ డిబెంచర్‌ ట్రస్టీ ‘బీకన్‌ ట్రస్టీషిప్‌ లిమిటెడ్‌’ ఐపీఓ ఈనెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. ఇష్యూలో విక్రయించనున్న షేర్ల ధరల శ్రేణిని కంపెనీ రూ.57-60గా నిర్ణయించింది. తద్వారా రూ.32 కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.

Updated Date - May 23 , 2024 | 05:52 AM