Share News

Krishna Ella : కృష్ణ ఎల్లాకు ప్రతిష్ఠాత్మక అవార్డు

ABN , Publish Date - May 25 , 2024 | 05:51 AM

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లాకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు లభించింది.

Krishna Ella : కృష్ణ ఎల్లాకు ప్రతిష్ఠాత్మక అవార్డు

భారత్‌ బయోటెక్‌ కో-ఫౌండర్‌

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లాకు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవార్డు లభించింది. జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూంబర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇచ్చే డీన్స్‌ మెడల్‌కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల 22న మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో జరిగిన బ్లూమ్‌బర్గ్‌ స్కూల్స్‌ స్నాతకోత్సవంలో డీన్‌ ఎల్లన్‌ జే మెకంజీ, కృష్ణ ఎల్లాకు ఈ అవార్డు అందజేశారు. ప్రజా ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కృష్ణ ఎల్లా చేసిన కృషి, ముందు చూపుతో కూడిన నాయకత్వాలకు గుర్తింపుగా డాక్టర్‌ కృష్ణ ఎల్లా ఈ అవార్డుకు ఎంపికైనట్టు భారత్‌ బయోటెక్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగానూ ప్రజారోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కృష్ణ ఎల్లా నాయకత్వంలోని భారత్‌ బయోటెక్‌ పట్టుదలతో దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఎంతగానో దోహదం చేశాయని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూంబర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కొనియాడింది.

Updated Date - May 25 , 2024 | 05:51 AM