ఆకాశ ఎయిర్‌లోకి ప్రేమ్‌జీ పెట్టుబడులు!?
ABN , Publish Date - Aug 25 , 2024 | 05:39 AM
దివంగత ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం మెజారిటీ వాటా కలిగిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీతో పాటు మణిపాల్ గ్రూప్‌నకు చెందిన రంజన్ పాయ్ స్వల్ప వాటాలు...
న్యూఢిల్లీ: దివంగత ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం మెజారిటీ వాటా కలిగిన ఆకాశ ఎయిర్‌లైన్స్‌లో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్‌జీతో పాటు మణిపాల్ గ్రూప్‌నకు చెందిన రంజన్ పాయ్ స్వల్ప వాటాలు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటా విక్రయం ద్వారా 12.5 కోట్ల డాలర్ల (సుమారు రూ.1,050 కోట్లు) వరకు సమీకరించేందుకు అజీమ్ ప్రేమ్‌జీ వ్యక్తిగత పెట్టుబడి సంస్థ ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌తో పాటు పాయ్‌కి చెందిన క్లేపాండ్ క్యాపిటల్‌తో ఆకాశ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆకాశ ఎయిర్‌లో ఝున్‌ఝున్‌వాలా కుటుంబం, సీఈఓ వినయ్ దూబే కు కలిపి 65 శాతం వాటా ఉంది. ప్రస్తుతం 24 విమానాలతో 27 నగరాలకు విమానయాన సేవలందిస్తోన్న ఆకాశ ఎయిర్.. 4.7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.