Share News

22,300 పైన నిలకడ తప్పనిసరి

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:55 AM

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనా 22,000 వద్ద విఫలమై 300 పాయింట్ల మేరకు కరెక్షన్‌కు లోనైంది. కాని చివరి ట్రేడింగ్‌ రోజున బలమైన రికవరీ సాధించి జీవితకాల గరిష్ఠ స్థాయి 22,200 సమీపం లో క్లోజైంది.

22,300 పైన నిలకడ తప్పనిసరి

నిఫ్టీ గత వారం పాజిటివ్‌గా ప్రారంభమైనా 22,000 వద్ద విఫలమై 300 పాయింట్ల మేరకు కరెక్షన్‌కు లోనైంది. కాని చివరి ట్రేడింగ్‌ రోజున బలమైన రికవరీ సాధించి జీవితకాల గరిష్ఠ స్థాయి 22,200 సమీపం లో క్లోజైంది. 22,000 వద్ద ఆరు వారాల పాటు సాగిన సైడ్‌వేస్‌, కన్సాలిడేషన్‌ అనంతరం గత వారం బ్రేకౌట్‌ సాధించింది. ఆకస్మిక బలహీనత ఏదైనా ఏర్పడితే తప్ప మార్కెట్‌ సానుకూల ట్రెండ్‌లో ఉంది. అమెరికా, భారత్‌ త్రైమాసిక జీడీపీ గణాంకాలు వెలువడనున్న దృష్ట్యా మార్కెట్‌కు ఈ వారం అత్యంత కీలకం. ఈ గణాంకాలకు మార్కెట్‌ బలంగా స్పందించే ఆస్కారం ఉంది. గత వారంలో మిడ్‌క్యాప్‌ 10, స్మాల్‌క్యాప్‌ 100 సూచీలు కన్సాలిడేషన్‌ ధోరణిలో ట్రేడయ్యాయి. గతంలో ఏర్పడిన గరిష్ఠ స్థాయిల కన్నా దిగువనే ఉన్నాయి. గతవారం ప్రధాన నిరోధ స్థాయిల్లో బ్రేకౌట్‌ సాధించినందు వల్ల టెక్నికల్‌ పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉంది. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఈ పుల్‌బ్యాక్‌లో కూడా సానుకూలత కోసం రాబోయే కొద్ది రోజుల్లో మార్కెట్‌ మద్దతు స్థాయిల కన్నా పైన తప్పనిసరిగా నిలదొక్కుకోవాలి.

బుల్లిష్‌ స్థాయిలు: మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిఫ్టీ గత శుక్రవారం ఏర్పడిన జీవితకాల గరిష్ఠ స్థాయి 22,300 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ఆ పైన కొత్త శిఖరాలకు బాటలు వేస్తుంది. మానసిక అవధి 22,600.

బేరిష్‌ స్థాయిలు: బలహీనతకు లోనైనా తక్షణ అప్‌ట్రెండ్‌ కోసం ప్రధాన మద్దతు స్థాయి 22,000 వద్ద నిలదొక్కుకుని తీరాలి. ఈ స్థాయిలో విఫలమైతే స్వల్పకాలిక బలహీనత దిశగా అప్రమత్తతను సూచిస్తుంది.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ గత వారం మైనర్‌ అప్‌ట్రెండ్‌లో ట్రేడయి 425 పాయింట్ల లాభంతో క్లోజైంది. కాని గరిష్ఠ, కనిష్ఠ స్థాయిలకు నడుమ అనిశ్చితంగా క్లోజ్‌ కావడం మరింత కన్సాలిడేషన్‌ ఉండవచ్చుననేందుకు సంకేతం. గత కొద్ది వారాలుగా ఈ సూచీ 47,000 వద్ద నిరోధం ఎదుర్కొంటోంది. మరింత అప్‌ట్రెండ్‌ కోసం నిరోధ స్థాయి 47,300 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. మద్దతు స్థాయి 46,500 వద్ద విఫలమైతే అప్రమత్త సంకేతం ఇస్తుంది.

పాటర్న్‌: మార్కెట్‌కు 22,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద మద్దతు ఉంది. సానుకూలత కోసం ఇక్కడ కన్సాలిడేట్‌ అయి తీరాలి.

టైమ్‌ : ఈ సూచీ ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు.

Updated Date - Feb 26 , 2024 | 03:55 AM