Share News

కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయానికి అనుమతి

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:19 AM

తన పూర్తి అనుబంధ విభాగమైన కోటక్‌ మహీంద్రా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి విక్రయించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని...

కోటక్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో వాటా విక్రయానికి అనుమతి

తన పూర్తి అనుబంధ విభాగమైన కోటక్‌ మహీంద్రా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 70 శాతం వాటాను జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీకి విక్రయించేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపిందని కోటక్‌ బ్యాంక్‌ బుధవారం వెల్లడించింది. ఈ డీల్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) గతనెలలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కోటక్‌ మహీంద్రా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో వాటా కొనుగోలు చేయబోతున్నట్లు గత నవంబరులో జ్యూరిచ్‌ ఇన్సూరెన్స్‌ ప్రకటించింది. మూలధనం సమకూర్చడంతోపాటు షేర్ల కొనుగోలు ద్వారా తొలుత 51 శాతం వాటా దక్కించుకోనున్నట్లు.. ఆ తర్వాత మూడేళ్లలో మరో 19 శాతం వాటాను రూ.5,560 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుత నియంత్రణ నియమావళి ప్రకారం.. విదేశీ సంస్థలు దేశీయ బీమా సంస్థలో 74 శాతం వరకు వాటా కొనుగోలు చేసేందుకు అనుమతి ఉంది.

Updated Date - Jun 06 , 2024 | 04:19 AM