Share News

అంబానీ చేతికి పేటీఎం వాలెట్‌!

ABN , Publish Date - Feb 06 , 2024 | 02:51 AM

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ తన వాలెట్‌ బిజినె్‌సను విక్రయించేందుకు ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సతో పాటు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌తో చర్చలు...

అంబానీ చేతికి పేటీఎం వాలెట్‌!

రేసులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సైతం..

న్యూఢిల్లీ: పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ తన వాలెట్‌ బిజినె్‌సను విక్రయించేందుకు ముకేశ్‌ అంబానీకి చెందిన జియో ఫైనాన్షియల్‌ సర్వీసె్‌సతో పాటు హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంక్‌తో చర్చ లు జరుపుతున్నట్లు తెలిసింది. పేటీఎం వాలెట్‌ సేవలు.. ఆర్‌బీఐ నిషే ధం విధించిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ పరిధిలోకే వస్తాయి. పేటీఎం మేనేజ్‌మెంట్‌ గత నవంబరు నుంచే జియో ఫైనాన్షియల్‌తో చర్చలు జరుపుతున్నదని, హెచ్‌డీఎ్‌ఫసీతో చర్చలు ఆర్‌బీఐ నిషేధానికి కొన్ని రోజుల ముందే ప్రారంభించినట్లు సమాచారం. కాగా, అంబానీకి చెందిన ఈ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ).. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ను మొత్తంగా కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న ట్లు ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. హెచ్‌డీఎ్‌ఫసీకి చెందిన డిజిటల్‌ వాలెట్‌ పేజా్‌పకు ఇప్పటికే 1.4 కోట్ల మంది కస్టమర్లున్నారు. పేటీఎం వాలెట్‌ను దక్కించుకోగలిగితే ఈ సెగ్మెంట్లో అగ్రగామి కంపెనీ కాగలదు. ప్రస్తుతానికి ఈ సేవల్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన జియో ఫైనాన్షియల్స్‌కు పేటీఎంతో డీల్‌ బాగా కలిసిరావచ్చని ఇండస్ట్రీ వర్గాలన్నాయి.

ఫిబ్రవరి 29 తరువాత నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌) డిపాజిట్లు స్వీకరించకుండా గతవారం ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. కస్టమర్ల సేవింగ్‌, కరెంట్‌ అకౌంట్లతో పాటు ప్రీ-పెయిడ్‌ సాధనాలైన వాలెట్లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌లు(ఎన్‌సీఎంసీ) ఫాస్టాగ్‌ అకౌంట్లలోకి డిపాజిట్లు లేదా టాప్‌-అ్‌పలను స్వీకరించవద్దని బ్యాంక్‌ను ఆదేశించింది. అయితే, అకౌంట్లలోకి వడ్డీ, కాష్‌బ్యాక్‌ లేదా రిఫండ్‌ సొమ్మును మాత్రం జమచేయవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు, కస్టమర్లు తమ అకౌంట్‌లో ఉన్న నగదును ఉన్నంతవరకు వినియోగించుకునేందుకు, ఉపసంహరించుకునేందుకూ ఎలాంటి ఆంక్షలుండవని తెలిపింది. ఇవి తప్ప మార్చి 1 నుంచి ఐఎంపీఎస్‌, ఏఈపీఎస్‌ వంటి నగదు బదిలీ లావాదేవీలు, భారత్‌ బిల్‌ పేమెంట్‌ లావాదేవీలు, యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) సేవలను అందిచడానికి వీల్లేదని పీపీబీఎల్‌ను ఆదేశించింది. దీంతో ఈ నెలాఖరు నుంచి పీపీబీఎల్‌ సేవలు దాదాపుగా నిలిచిపోనున్నాయి. 2022 మార్చిలోనే పీపీబీఎల్‌ కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. పీపీబీఎల్‌ లైసెన్సును వచ్చే నెలలో రద్దు చేసే దిశగా ఆర్‌బీఐ యోచిస్తున్నదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. తొలు త డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించాక బ్యాంక్‌పై వేటు వేయవచ్చన్నారు. కాగా, పీపీబీఎల్‌లో మనీలాండరింగ్‌ జరిగినట్లు ఆర్‌బీఐ గుర్తిస్తే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా అన్నారు.

పేటీఎం షేరు మరో 10 శాతం డౌన్‌

పేటీఎం బ్రాండ్‌ యాజమాన్య సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ షేరు వరుసగా మూడో రోజూ లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. సోమవారం బీఎ్‌సఈలో ఈ షేరు ధర మరో 10 శాతం క్షీణించి రూ.438.35 వద్దకు పతనమైంది. గత మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఈ షేరు 42 శాతం క్షీణించింది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువ (క్యాపిటలైజేషన్‌) రూ.20,471.25 కోట్లు తగ్గి రూ.27,838 కోట్ల స్థాయికి జారుకుంది.

పీపీబీఎల్‌ కస్టమర్లకు ప్రత్యామ్నాయాలు..

ఆర్‌బీఐ నిషేధం నేపథ్యంలో పీపీబీఎల్‌ కస్టమర్లు తమ ఖాతాలోని సొమ్మును యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ), ఇమ్మీడియేట్‌ పేమెంట్‌ సర్వీస్‌ (ఐఎంపీఎస్‌), రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌) ద్వారా ఇతర అకౌంట్లోకి బదిలీ చేసుకోవచ్చు. కానీ, మీ పీపీబీఎల్‌ అకౌంట్లోకి మాత్రం మార్చి ఒకటి నుంచి సొమ్ము జమ చేయలేరు. పేటీఎం వాలెట్‌లోని సొమ్మును కూడా ఇతర అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అయితే, పేటీఎం వాలెట్‌పై ఒక లావాదేవీ ద్వారా గరిష్ఠంగా రూ.25,000, రోజుకు గరిష్ఠంగా రూ.లక్ష బదిలీ చేసుకోగలుగుతారు. అయితే, ఇందుకు 3 శాతం లావాదేవీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.25,000 బదిలీకి రూ.750 రుసుము చెల్లించాలి. పీపీబీఎల్‌ వాలెట్‌, ఫాస్టాగ్‌, ఎన్‌సీఎంసీ సేవలను ఇతర బ్యాంక్‌లకు బదిలీ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు బ్యాంక్‌ ఇప్పటికే వెల్లడించింది.

పీపీబీఎల్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర సంస్థల వాలెట్‌, ఫాస్టాగ్‌ సేవలకు మారవచ్చు. దేశంలో 20కి పైగా బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలు వాలెట్‌ సేవలందిస్తున్నాయి. మొబీక్విక్‌, ఫోన్‌పే, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అమెజాన్‌ పే అందులో కొన్ని. అలాగే, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ వంటి 37 ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లు ఫాస్టాగ్‌ సేవలందిస్తున్నాయి. కస్టమర్లు తమ ఫాస్టాగ్‌ను మొబైల్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో రీచార్జ్‌ చేసుకునే వీలుంటుంది.

ఆర్‌బీఐ ఆదేశాలతో తమ రుణ, బీమా పంపిణీ, ఈక్విటీ బ్రోకింగ్‌ వ్యాపారాలకు పీపీబీఎల్‌తో సంబంధం లేదు కాబట్టి వాటిపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటీఎం ఇప్పటికే స్పష్టం చేసింది. అంతేకాదు, కంపెనీకి చెందిన ఆఫ్‌లైన్‌ మర్చంట్‌ పేమెంట్‌ నెట్‌వర్కింగ్‌ సేవలైన పేటీఎం క్యూఆర్‌, పేటీఎం సౌండ్‌బాక్స్‌, పేటీఎం కార్డ్‌ మెషీన్‌ యధాతథంగా కొనసాగనున్నాయి. ఈ సేవల్లో కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు ఎలాంటి ఆంక్షల్లేవని పేటీఎం వెల్లడించింది.

Updated Date - Feb 06 , 2024 | 02:51 AM