Share News

పసిడి పడింది..

ABN , Publish Date - Aug 07 , 2024 | 02:44 AM

బులియన్‌ ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,100 తగ్గి రూ.71,700కు దిగివచ్చింది. ఆభరణ వర్తకులు, రిటైల్‌ కొనుగోలుదారుల...

పసిడి పడింది..

బులియన్‌ ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,100 తగ్గి రూ.71,700కు దిగివచ్చింది. ఆభరణ వర్తకులు, రిటైల్‌ కొనుగోలుదారుల నుంచి గిరాకీ తగ్గడం ఇందుకు కారణమైంది. కిలో వెండి కూడా రూ.2,200 తగ్గుదలతో రూ.82,000కు పరిమిత మైంది. వెండి ధరలు తగ్గడం వరుస గా ఇది నాలుగో రోజు. ఈ 4 రోజుల్లో కిలో వెండి రూ.4,200 తగ్గిందని ఆల్‌ ఇండియా సరాఫా అసోసియేషన్‌ వెల్లడించింది. హైదరాబాద్‌ మార్కెట్లో తులం మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ.670 తగ్గి రూ.69,710కి జారుకోగా.. కిలో వెండి ఏకంగా రూ.3,500 తగ్గి రూ.87,500కు దిగివచ్చింది. రూపాయి మరింత బలహీనపడటంతో పాటు పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడం దేశీయంగా బులియన్‌ ధరలకు మద్దతివ్వవచ్చని హెచ్‌డీఎ్‌ఫసీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ దిలీప్‌ పర్మార్‌ అన్నారు.

Updated Date - Aug 07 , 2024 | 02:44 AM