Share News

మన స్టాక్‌ మార్కెట్‌ పరుగుకు ఢోకా లేదు..

ABN , Publish Date - Feb 20 , 2024 | 04:43 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఢోకా లేదని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. ఇప్పటికే జీడీపీని మించిపోయిన మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మరో పాతికేళ్లలో (2047 నాటికి) మరింతగా పెరగనుందన్నారు...

మన స్టాక్‌ మార్కెట్‌ పరుగుకు ఢోకా లేదు..

వచ్చే పాతికేళ్లలో 50 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌

  • అందరి ఆమోదంతోనే ట్రేడింగ్‌ సమయం పెంపు..

  • ఎన్‌ఎ్‌సఈ ఎండీ ఆశిష్‌ చౌహాన్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఢోకా లేదని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎ్‌సఈ) ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. ఇప్పటికే జీడీపీని మించిపోయిన మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ మరో పాతికేళ్లలో (2047 నాటికి) మరింతగా పెరగనుందన్నారు. అప్పటికి దేశ జీడిపీ 30 లక్షల కోట్ల డాలర్లు ఉంటే.. మార్కెట్‌ క్యాప్‌ 50 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందన్నారు. ప్రస్తుత డాలర్‌-రూపాయి మారకం రేటు ప్రకారం ఇది రూ.4,150 లక్షల కోట్లకు సమానం. ప్రస్తుతం భారత స్టాక్‌ మార్కెట్‌ క్యాప్‌ 4.5 లక్షల కోట్ల డాలర్ల నుంచి 4.6 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.373.5 లక్షల కోట్ల నుంచి రూ.381.8 లక్షల కోట్లు) మాత్రమే.

టెక్నాలజీనే ఊతం : వచ్చే పాతికేళ్లలో దేశీయ టెక్నాలజీ కంపెనీలు పెద్ద ఎత్తున సంపదను సృష్టించబోతున్నట్టు చౌహాన్‌ తెలిపారు. మన దేశం ఇప్పటికే అనేక టెక్నాలజీలకు ప్రపంచంలో ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. గత పదేళ్లలో టెక్నాలజీ దాదాపు అన్ని దైనందిక కార్యకలాపాల్లో భాగమై పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుకి 6.15 గంటలు మాత్రమే ఉన్న ట్రేడింగ్‌ సమయాన్ని పెంచే విషయంపైనా చౌహాన్‌ మాట్లాడారు. బ్రోకర్లతో సహా అందరూ ఇందుకు అంగీకరించాల్సి ఉందన్నారు. కొన్ని దేశాల్లో స్టాక్‌ ఎక్స్చేంజీలు ఇప్పటికే 24 గంటలు ట్రేడింగ్‌ను అనుమతిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు

Updated Date - Feb 20 , 2024 | 04:44 AM