Share News

మన మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ సబబే

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:14 AM

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ అధిక వాల్యుయేషన్స్‌ను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌ సమర్ధించారు. మదుపరులకు ముఖ్యంగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు మన ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్‌ మార్కెట్‌పై...

మన మార్కెట్‌ వాల్యుయేషన్స్‌ సబబే

నమ్మకం, విశ్వాసం ఉండబట్టే పెట్టుబడులు: సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ అధిక వాల్యుయేషన్స్‌ను మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చీఫ్‌ మాధవి పురి బుచ్‌ సమర్ధించారు. మదుపరులకు ముఖ్యంగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు మన ఆర్థిక వ్యవస్థ, క్యాపిటల్‌ మార్కెట్‌పై నమ్మకం, విశ్వాసం, ఆశావాదం ఉండబట్టే వాల్యుయేషన్స్‌ అధికంగా ఉన్నా పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌పై సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో ఆమె ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ 22.2 పీఈ వద్ద ట్రేడవుతోంది. అనేక దేశాల స్టాక్‌ మార్కెట్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని మాధవి అన్నారు. తాను భేటీ అయిన ఎఫ్‌పీఐల ప్రధాన అధికారులు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై అత్యంత నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేశారన్నారు. నమ్మకం అనే అంశంపైనే క్యాపిటల్‌ మార్కెట్‌ అనే భవనం నిలబడి ఉందన్నారు. ఇందుకు పారదర్శక లావాదేవీలు అత్యంత ముఖ్యమన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 02:14 AM