Share News

ఆటుపోట్లకు అవకాశం!

ABN , Publish Date - Feb 26 , 2024 | 03:56 AM

చివరి నాలుగు సెషన్లలో ఈ షేరు లాభాల్లోనే ముగిసింది. గత శుక్రవారం ఈ షేరు 3.41 శాతం లాభంతో రూ.2,468 వద్ద క్లోజైంది.

ఆటుపోట్లకు అవకాశం!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారం మిశ్రమంగా కదలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతవారం నిఫ్టీ ప్రతి సెషన్‌లోనూ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకింది. అయితే పటిష్ఠతను కనబరచకపోవటంతో కొద్దిగా నిరోధాన్ని ఎదుర్కొంది. ఈ వారం డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా ఆటుపోట్లకు అవకాశం ఉంది. నిఫ్టీ మార్చి ఫ్యూచర్స్‌కు 22,350 వద్ద మద్దతు, 22,500 వద్ద నిరోధ స్థాయిలున్నాయు. వీటిని బట్టే గమనం ఉంటుంది. నిరోధాన్ని ఎదుర్కొంటేనే బుల్లి్‌షనెస్‌ వస్తుంది. లేదంటే కరెక్షన్‌కు వీలుంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌: చివరి నాలుగు సెషన్లలో ఈ షేరు లాభాల్లోనే ముగిసింది. గత శుక్రవారం ఈ షేరు 3.41 శాతం లాభంతో రూ.2,468 వద్ద క్లోజైంది. నిఫ్టీతో పోలిస్తే ఈ కౌంటర్‌ మెరుగైన పనితీరును కనబరుస్తోంది. డెలివరీ, ట్రేడింగ్‌ వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతోంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లోకి రూ.2,450 శ్రేణిలో ప్రవేశించి రూ.2,550/2,610 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,410 వద్ద కచ్చితమైన స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

జెఎ్‌సడబ్ల్యూ ఎనర్జీ: సుదీర్ఘకాలంగా ఈ కౌంటర్‌లో అప్‌ట్రెండ్‌ కొనసాగుతోంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాలు ప్రకటించినప్పటి నుంచి అక్యుములేషన్‌ జరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు 3.86 శాతం లాభంతో రూ.506 వద్ద క్లోజైంది. మూమెంటమ్‌ ట్రేడర్లు రూ.500 స్థాయిల్లో ఈ కౌంటర్‌లోకి ప్రవేశించి రూ.585/655 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.475 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఎస్‌బీఐ లైఫ్‌: డిసెంబరు త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి ఈ షేరు జోరును ప్రదర్శిస్తోంది. వాల్యూమ్‌ను బట్టి ఇన్వెస్టర్లు ఈ స్టాక్స్‌ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. గత శుక్రవారం రూ.1,529 వద్ద క్లోజైన ఈ షేరు సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. నిరోధాన్ని అధిగమిస్తే మరింత బుల్లి్‌షనెస్‌ వస్తుంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లోకి రూ.1,500 శ్రేణిలో ఎంటరై రూ.1,580/1,640 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,470 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అంబుజా సిమెంట్స్‌: సుదీర్ఘ దిద్దుబాటు తర్వాత గత ఏడాది నవంబరులో ప్రారంభమైన బుల్‌రన్‌ ఇంకా కొనసాగుతోంది. జార్ఖండ్‌లో కొత్తగా రూ.1,000 కోట్లతో యూనిట్‌ ఏర్పాటు చేస్తుండటం, నిఫ్టీతో పోలిస్తే మెరుగైన ప్రదర్శన, తాజాగా జీవితకాల గరిష్ఠాన్ని అధిగమించటం కలిసి వచ్చే అంశాలు. గత శుక్రవారం ఈ షేరు రూ.602 వద్ద క్లోజైంది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.600 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.660/725 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.575 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

అదానీ విల్మార్‌ : కొద్ది నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో ఉన్న ఈ కౌంటర్‌లో ఇప్పుడిప్పుడే మూమెంటమ్‌ పెరుగుతోంది. గత వారం ఈ షేరు దాదాపు 13 శాతం మేర లాభపడింది. ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ గణనీయంగా పెరిగింది. గత శుక్రవారం ఒక్కరోజే 8.12 శాతం లాభంతో 389.95 వద్ద క్లోజైంది. ఈ కౌంటర్‌లోకి ఇన్వెస్టర్లు రూ.375 శ్రేణిలో ప్రవేశించి రూ.410/480 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.355 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

Updated Date - Feb 26 , 2024 | 03:56 AM