Share News

హైదరాబాద్‌లో ఓపెన్‌టెక్ట్స్‌ కొత్త సెంటర్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 01:59 AM

సమాచార సాంకేతిక పరిజ్ఞానంలోని ఓపెన్‌టెక్స్ట్‌ మంగళవారం హైదరాబాద్‌లో కొత్త డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లో ఫినిక్స్‌ టెక్‌ జోన్‌లో....

హైదరాబాద్‌లో ఓపెన్‌టెక్ట్స్‌ కొత్త సెంటర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సమాచార సాంకేతిక పరిజ్ఞానంలోని ఓపెన్‌టెక్స్ట్‌ మంగళవారం హైదరాబాద్‌లో కొత్త డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌లో ఫినిక్స్‌ టెక్‌ జోన్‌లో నాలుగు అంతస్తుల్లో దీన్ని ఏర్పాటు చేశారు. తమ ఇంజనీరింగ్‌ కార్యకలాపాలకు ఇది హబ్‌గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ కేంద్రంలోని ఇంజనీర్లు అనేక ఓపెన్‌టెక్స్ట్‌ బిజినెస్‌ క్లౌడ్స్‌కు ప్రాడక్ట్‌ డెవల్‌పమెంట్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్లోబల్‌ ఏఐ ఇన్నోవేషన్స్‌లో ఈ సెంటర్‌ కీలక పాత్ర పోషించనుందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ప్రాడక్ట్‌ ఆఫీసర్‌ ముహి మజోబ్‌ అన్నారు. ఓపెన్‌టెక్ట్స్‌ ప్రస్తుతం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో సెంటర్లను నిర్వహిస్తోంది.

Updated Date - Jun 12 , 2024 | 01:59 AM