Share News

ఏప్రిల్‌లో నవీముంబై విమానాశ్రయం ప్రారంభం

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:02 AM

నిర్మాణంలో ఉన్న నవీ ముంబై విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 17న ప్రారంభం కావచ్చని అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ సీఈఓ అరుణ్‌ బన్సల్‌ తెలిపారు...

ఏప్రిల్‌లో నవీముంబై విమానాశ్రయం ప్రారంభం

ముంబై: నిర్మాణంలో ఉన్న నవీ ముంబై విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 17న ప్రారంభం కావచ్చని అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ సీఈఓ అరుణ్‌ బన్సల్‌ తెలిపారు. ఆదివారం ఈ విమానాశ్రయంలోని 26/08 రన్‌వేపై ఇండిగో ఏ320 ప్రయాణికుల విమానం విజయవంతంగా దిగింది. విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏరోడ్రోమ్‌ లైసెన్సు ఇవ్వడానికి ఈ ప్రయోగం మార్గం సుగమం చేస్తుంది. మే ద్వితీయార్ధం నుంచి ఈ విమానాశ్రయం నుంచి సాధారణ రాకపోకలు ప్రారంభించాలని తాము భావిస్తున్నట్టు చెప్పారు. మొదటి ప్రయోగం విజయవంతమైన తర్వాత కొన్ని విధివిధానాలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 04:02 AM