Share News

14 % తగ్గిన ఓఎన్‌జీసీ లాభం

ABN , Publish Date - Feb 12 , 2024 | 05:09 AM

ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన...

14 % తగ్గిన ఓఎన్‌జీసీ లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఓఎన్‌జీసీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికానికి గాను స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన నికరలాభం 14 శాతం క్షీణించి రూ.9,536 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.11,045 కోట్లుగా ఉంది. త్రైమాసిక కాలంలో గ్యాస్‌, చమురు ధరలు పడిపోవటం పనితీరును దెబ్బతీసిందని పేర్కొంది. కాగా ఈ కాలంలో మొత్తం ఆదాయం కూడా 10 శాతం క్షీణించి రూ.34,789 కోట్లకు చేరింది. కాగా ఒక్కో షేరుకు 80 శాతం (రూ.4) రెండో మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు ఆమోదించింది. డివిడెండ్‌ చెల్లింపులకు గాను కంపెనీ రూ.5,032 కోట్లు కేటాయించింది. గత ఏడాది నవంబరులో ఒక్కో షేరుకు రూ.5.75 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. కాగా డిసెంబరుతో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి గాను కంపెనీ నికర లాభం 24 శాతం క్షీణించి రూ.29,767 కోట్లుగా నమోదైంది.

Updated Date - Feb 12 , 2024 | 05:09 AM