Share News

ఒకటి ఐదుగా.. కెనరా బ్యాంక్‌ షేర్ల విభజనకు బోర్డు ఆమోదం

ABN , Publish Date - Feb 27 , 2024 | 04:35 AM

ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్‌ షేర్లను 1:5 నిష్పత్తిలో విభజిస్తున్నట్లు ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును ఒక్కోటి రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించనుంది...

ఒకటి ఐదుగా..  కెనరా బ్యాంక్‌ షేర్ల విభజనకు బోర్డు ఆమోదం

కెనరా బ్యాంక్‌ షేర్ల విభజనకు బోర్డు ఆమోదం

ముంబై: ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్‌ షేర్లను 1:5 నిష్పత్తిలో విభజిస్తున్నట్లు ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును ఒక్కోటి రూ.2 ముఖ విలువ కలిగిన ఐదు షేర్లుగా విభజించనుంది. సోమవారం సమావేశమైన బ్యాంక్‌ బోర్డు ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మార్కెట్లో బ్యాంక్‌ షేర్ల లభ్యతను పెంచడంతోపాటు చిన్న మదుపరులకు సైతం ధర అందుబాటులో ఉండేందుకే షేర్లను విభజిస్తున్నట్లు కెనరాబ్యాంక్‌ తెలిపింది. ఇందుకు ఆర్‌బీఐ అనుమతి తెలుపాల్సి ఉంటుందని, విభజన ప్రక్రి య పూర్తికి 2-3 నెలలు పట్టవచ్చని బ్యాంక్‌ వెల్లడించింది. బీఎ్‌సఈలో బ్యాంక్‌ షేరు ధర 1.24 శాతం నష్టపోయి రూ.572.80 వద్ద ముగిసింది.

Updated Date - Feb 27 , 2024 | 04:35 AM