వచ్చేనెల 2 నుంచి ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:58 AM
విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ వచ్చేనెల 2న ప్రారంభమై 6న ముగియనుంది. ఈ ఐపీఓలో సందర్భంగా కంపెనీ మార్కెట్ విలువను 420-440 కోట్ల డాలర్ల (రూ.35,166-36,840 కోట్లు) స్థాయిలో..

ముంబై: విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ వచ్చేనెల 2న ప్రారంభమై 6న ముగియనుంది. ఈ ఐపీఓలో సందర్భంగా కంపెనీ మార్కెట్ విలువను 420-440 కోట్ల డాలర్ల (రూ.35,166-36,840 కోట్లు) స్థాయిలో లెక్కించే అవకాశం ఉంది. అలాగే, ఓలా ఎలక్ట్రిక్ ఈ ఏడాదిలో అతిపెద్ద ఐపీఓల్లో ఒకటి కానుంది. అంతేకాదు, భారత్‌లో ఐపీఓకు వస్తున్న తొలి ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ కూడా ఇదే కానుంది.