Share News

ఆయిల్‌ ఇండియా బోనస్‌ షేరు

ABN , Publish Date - May 21 , 2024 | 02:01 AM

ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ ఇండి యా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) వాటాదారులకు బోనస్‌ షేర్లు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. వారి వద్ద ఉన్న ప్రతి రెండు షేర్లకు ఒక బోనస్‌ షేరు జారీ...

ఆయిల్‌ ఇండియా బోనస్‌ షేరు

ప్రతి రెండు షేర్లకు ఒక బోనస్‌ షేరు జారీ

క్యూ4 లాభం రూ.2,333 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఆయిల్‌ ఇండి యా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) వాటాదారులకు బోనస్‌ షేర్లు జారీ చేస్తున్నట్టు ప్రకటించింది. వారి వద్ద ఉన్న ప్రతి రెండు షేర్లకు ఒక బోనస్‌ షేరు జారీ చేయనున్నట్టు తెలిపింది. అలాగే రూ.10 ముఖ విలువ గల (బోన్‌సకు ముందు) ఒక్కో షేరుపై రూ.3.75 తుది డివిడెండ్‌ కూడా ప్రకటించింది. బోనస్‌ అనంతరం తుది డివిడెండ్‌ రూ.2.50 అవుతుంది. ఇప్పటికే కంపెనీ రెండు విడతలుగా చెల్లించిన మధ్యంతర డివిడెండు రూ.12 (బోన్‌సకు ముందు) ఇది అదనం. కాగా మార్చి త్రైమాసికంలో కంపెనీ 18 శాతం వృద్ధితో రూ.2,332.94 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన లాభం రూ. 1,979.74 కోట్లు. క్రూడాయిల్‌ ధరల పెరుగుదల లాభాల వృద్ధికి దోహదపడినట్టు కంపెనీ ప్రకటించింది.


ఇదే కాలంలో టర్నోవర్‌ కూడా 16% వృద్ధితో రూ.10,375.09 కోట్లకు చేరింది. క్రూడాయిల్‌ ఉత్పత్తి, విక్రయం ద్వారా సమకూరిన ఆదాయం 18 శాతం వృద్ధి చెందగా గ్యాస్‌ ఉత్పత్తి విక్రయం ద్వారా మాత్రం ఆదాయం 16.5 శాతం క్షీణించింది. మార్చి 31వ తేదీతో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరంలో లాభం 29 శాతం క్షీణించి రూ.6,980.45 కోట్లకు దిగివచ్చింది.

Updated Date - May 21 , 2024 | 02:01 AM