ఎన్‌విడియా నం.1
ABN , Publish Date - Oct 27 , 2024 | 05:27 AM
అమెరికన్ ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా యాపిల్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఎన్‌విడియా షేర్లు రికార్డు స్థాయికి వృద్ధి చెందడంతో...
ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరణ
రెండో స్థానానికి జారిన యాపిల్
న్యూయార్క్: అమెరికన్ ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా యాపిల్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. శుక్రవారం ట్రేడింగ్‌లో ఎన్‌విడియా షేర్లు రికార్డు స్థాయికి వృద్ధి చెందడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.53 లక్షల కోట్ల డాలర్లకు ఎగబాకింది. ఆ సమయంలో యాపిల్ మార్కెట్ క్యాప్ 3.52 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైంది. కంపెనీ సూపర్ కంప్యూటింగ్ ఏఐ చిప్‌లకు భారీగా డిమాండ్ నెలకొనడం ఇందుకు దోహదపడింది. ఈ నెలలో ఇప్పటివరకు ఎన్‌విడియా షేరు 18 శాతం పెరిగింది. కాగా, ఈ జూన్‌లోనూ ఎన్‌విడియా స్వల్పకాలం పాటు ప్రపంచ నం.1 కంపెనీగా ఎదిగినప్పటికీ.. యాపిల్, మైక్రోసా్‌ఫ్టలు మళ్లీ కంపెనీని అధిగమించేశాయి.