Indian Stock Market : ఎస్‌ఎంఈల లిస్టింగ్ మరింత కఠినం
ABN , Publish Date - Dec 21 , 2024 | 04:34 AM
చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్‌ఎంఈ) షేర్ల లిస్టింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) మరింత కఠినం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూ
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా కంపెనీల (ఎస్‌ఎంఈ) షేర్ల లిస్టింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎ్‌సఈ) మరింత కఠినం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కి వచ్చే ఎస్‌ఎంఈ కంపెనీ తన డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించే నాటికి తప్పనిసరిగా గత మూడేళ్లలో వరుసగా రెండేళ్ల పాటు కనీసం రూ.కోటి స్థూల లాభాలు ఆర్జిస్తూ ఉండాలి. అలాగే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ్‌ఫఎస్) కింద ప్రమోటర్లు, లేదా ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) సంస్థలు విక్రయించే షేర్లు.. మొత్తం ఇష్యూలో 20 శాతం మించకూడదు. వీటికి తోడు ప్రమోటర్లు లేదా వారి గ్రూప్ కంపెనీలు లేదా వారికి సంబంధించిన సంస్థల రుణాలు చెల్లించేందుకు జారీ చేసే ఎస్‌ఎంఈల ఐపీఓలను అనుమతించరు. సెబీ ఈ ప్రతిపాదనలకు సూత్రప్రాయ ఆమోద ముద్ర వేసిన మరుసటి రోజే ఎన్‌ఎ్‌సఈ, వాటి అమలుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఈ నెల 19 నుంచే ఈ కొత్త లిస్టింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు ఎన్‌ఎ్‌సఈ తెలిపింది. రిటైల్ మదుపరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య తీసుకున్నట్టు ఎన్‌ఎ్‌సఈ తెలిపింది.
ఇంటర్నేషనల్ జెమ్మాలాజికల్ ఇన్‌స్టిట్యూట్ షేర్లు లిస్టిం గ్ రోజున 13% లాభపడ్డాయి. శుక్రవారం ఇష్యూ ధర రూ.417పై బీఎ్‌సఈలో 21% లాభంతో రూ.504.85 వద్ద లిస్టింగైన ఈ షేరు ఇంట్రాడేలో రూ.525 స్థాయిని తాకి చివరకు 12.74% లాభంతో రూ.470.15వద్ద ముగిసింది.